ఖమేనీ సంధి ఒప్పందం?
ఇరాన్ కొత్త సుప్రీమ్ లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాతో చర్చలు జరిపడానికి అంగీకరించారా?, ఆ దేశంతో ఓ సంధి ఒప్పందం కుదుర్చుకోనున్నారా? అనే ప్రశ్నలకు తాజాగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. యుద్ధాన్ని కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమెరికాతో శాంతి చర్చలు జరిపడానికి మొజ్తబా ఖమేనీ అంగీకరించినట్లు అల్ అరబియా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. దీనిపై ప్రత్యేేక కథనాలను ప్రచురించింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడులు నాలుగో వారంలో ప్రవేశించిన నేపథ్యంలో తాజా పరిణమం చోటు చేసుకుంది. ఇది దౌత్యపరమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఇరాన్ దీనిపై ఇంకా స్పందించలేదు. ఆ దేశానికి చెందిన ఓ వార్తా సంస్థ మాత్రం అమెరికాతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంభాషణలు జరగలేదని పేర్కొంది.

అల్ అరబియా కథనాలకు బలం చేకూరుస్తూ.. డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధినాయకత్వంతో చర్చలు జరిగాయని ఆయన ధృవీకరించారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని, కొన్నింటిపై ఏకాభిప్రాయం ఏర్పడిందని వివరించారు. ఆదివారం నాడే చర్చలు మొదలయ్యాయని, మున్ముందు అవి సానుకూల, శాంతియుత వాతావరణంలో కొనసాగుతాయని ట్రంప్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
యుద్ధ పరిష్కారానికి త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా సాగుతున్న ఈ చర్చలు ఇప్పుడు కీలక దశ"లోకి ప్రవేశించాయని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ కీలక చర్చలలో పశ్చిమాసియా అంబాసిడర్ స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ పాల్గొన్నారు.
ఇరాన్‌తో చాలా కాలంగా చర్చలు జరుపుతున్నామని, ఈసారి వాళ్ళు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని తీవ్రంగా పరిశీలిస్తోన్నారని వ్యాఖ్యానించారు. ఈ చర్చలు మరింత ముందుకు సాగడానికి అయిదు రోజుల గడువును ఇస్తున్నట్లు తెలిపారు. ఈ గడువు ముగిసేనాటికి ఓ ఆమోదయోగ్య ఒప్పందం కుదుర్చుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొజ్తబా ఖమేనీనీ ప్రశంసించారాయన. అత్యంత గౌరవనీయుడని, లక్షలాదిమంది ప్రజలు బలంగా నమ్మే నాయకుడని కితాబిచ్చారు.
-
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!











Click it and Unblock the Notifications