వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షార్క్ ఈడ్చుకెళ్లినా తప్పించుకున్న సర్ఫర్(వీడియో)

|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్: అతని అదృష్టం బాగున్నట్లుంది. అందుకే ఓ భారీ షార్క్ దాడి చేసి ఈడ్చుకెళ్లినా తప్పించుకోగలిగాడు. అతడే ప్రముఖ ఆస్ట్రేలియా సర్ఫర్ మిక్ ఫ్యానింగ్. ఈ ఘటన జరిగింది దక్షిణాఫ్రికాలోని ఓ సముద్రంలో. మిక్ ఫ్యానింగ్ ఇప్పటికే సర్ఫింగ్‌లో మూడు టైటిళ్లు సాధించి దిగ్గజ సర్ఫర్‌గా కొనసాగుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం దక్షిణాఫ్రికాలో 'జెబె సర్ఫ్ ఓపెన్' నిర్వహించగా అందులో పాల్గొన్నాడు. షార్క్ దాడి ఘటన గురించి ఆయన వివరించాడు. లక్ష్యం మరికొద్ది దూరంలో ఉండగానే ఎవరో తన కాలు లాగుతున్నట్లు అనిపించిందిట. మొదటి సారి కాలు విదిలించాడు, కొద్ది సేపటి తర్వాత మళ్లీ అలాగే అని పించిందిట. దీంతో మళ్లీ అలాగే చేశాడు.

Surfer Mick Fanning escapes shark attack

కొద్ది సేపటికి వెనుక ఎవరో ఉన్నట్లుగా అనిపించిందని, తిరగి చూసేవరకు భయంకరమైన షార్క్ కోరపళ్లతో ఒక్కసారిగా తనపై విరుచుపడిందని చెప్పాడు. భయంతో కేకలు వేయడం మొదలు పెట్టాడు. చాలాసార్లు అతడ్ని నీటిలో ముంచి లోపలికి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసిందా షార్క్. అతని అరుపులు విని సమీపంలో ఉన్న సిబ్బంది వచ్చి రక్షించారు.

స్వల్పంగా గాయమైందని ఆ భయానక క్షణాలను వణికిపోతూ వివరించాడు ఫ్యానింగ్. జేబే సర్ఫ్ ఓపెన్ నిర్వాహకులు కూడా ‘మిక్ ఫ్యానింగ్ బతికి బయటపడ్డాడు మాకు అదే చాలు' అని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ దాడి ఘటనతో ఫైనల్స్ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

English summary
A surfing competition in South Africa was canceled Sunday after professional surfer Mick Fanning escaped a shark attack in the opening minutes of the final heat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X