వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఒరవడి: చైనా పర్యటనలో సుష్మా, రిక్ దేశాల సదస్సు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్‌లో పటిష్టమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇక్కడ జిన్‌పింగ్‌తో సమవేశమయ్యారు. భారత్- చైనా సంబంధాలు కొత్త ఒరడిని సృష్టించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికి కృషి జరగాలని సుష్మాతో ఆయన చెప్పారు.

‘భారత్- చైనా సంబంధాలు ఈ ఏడాది మరింత పటిష్టమవుతాయన్న నమ్మకం నాకుంది. ఒప్పందాల అమలు, దైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి' అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో ఆయన భారత్‌లో పర్యటించారు. మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో పర్యటించనున్నారు. మోడీ పర్యటన ఇరుదేశాల మధ్య మైత్రి సంబంధాలు మరింత పురోగమి దిశగా సాగుతాయని ఆశిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు స్పష్టం చేశారు. పరస్పర సహకారంతో అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన అన్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు సరిహద్దుల్లో శాంతికి దోహపడాలన్నారు.

ఆదివారం సుష్మా స్వరాజ్ చైనా విదేశాంగ మంత్రితో సమావేశమై పలు కీలకమైన అంశాలపై చర్చించారు. కైలాశ్ మానస సరోవర్ యాత్రికుల కోసం టిబెట్ నుంచి సిక్కం ద్వారా సాగే రెండో మార్గం అమలులోకి తెచ్చే విషయంపై చైనాతో చర్చించారు. నిరుడు భారత్ పర్యటన సందర్భంగా మోడీకికి చైనా అధ్యక్షుడు హామీ ఇచ్చారు.

భారత్ పర్యటనపై జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘నిరుడు భారత్ పర్యటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీతో కలిసి ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించడం ఎప్పటికీ మధుర స్మృతిగానే ఉంటుంది' అన్నారు. ఫిబ్రవరి 19న చైనా లూనర్ ఇయర్ పురస్కరించుకుని తన ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారని సుష్మా స్వరాజ్ తెలిపారు. మే 26కు ముందే మోడీ చైనా పర్యటనకు రానున్నారని ఆమె అన్నారు.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు: రిక్ దేశాల పిలుపు

సుష్మా చైనా పర్యటన

సుష్మా చైనా పర్యటన

భారత్‌లో పటిష్టమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇక్కడ జిన్‌పింగ్‌తో సమవేశమయ్యారు.

సుష్మా చైనా పర్యటన

సుష్మా చైనా పర్యటన

భారత్- చైనా సంబంధాలు కొత్త ఒరడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికి కృషి జరగాలని సుష్మాతో ఆయన చెప్పారు.

సుష్మా చైనా పర్యటన

సుష్మా చైనా పర్యటన

‘భారత్- చైనా సంబంధాలు ఈ ఏడాది మరింత పటిష్టమవుతాయన్న నమ్మకం నాకుంది. ఒప్పందాల అమలు, దైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి' అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.

సుష్మా చైనా పర్యటన

సుష్మా చైనా పర్యటన

సెప్టెంబర్‌లో ఆయన భారత్‌లో పర్యటించారు. మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో పర్యటించనున్నారు.

సుష్మా చైనా పర్యటన

సుష్మా చైనా పర్యటన

మోడీ పర్యటన ఇరుదేశాల మధ్య మైత్రి సంబంధాలు మరింత పురోగమి దిశగా సాగుతాయని ఆశిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు స్పష్టం చేశారు.

సుష్మా చైనా పర్యటన

సుష్మా చైనా పర్యటన

పరస్పర సహకారంతో అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన అన్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు సరిహద్దుల్లో శాంతికి దోహపడాలన్నారు.

సుష్మా చైనా పర్యటన

సుష్మా చైనా పర్యటన

అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్.. భారత నాయకత్వానికి అభినందలను తెలపాలని సుష్మా స్వరాజ్‌ను కోరారు. ‘మీరు భారత్ వెళ్లాక రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీకి నా అభినందనలు తెలియజేయండి' అని విదేశాంగ మంత్రితో అన్నారు.

అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని రిక్‌దేశాలైన రష్యా, భారత్, చైనా పిలుపునిచ్చాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిపైనా ఉగ్రవాదులకు అండదండలు అందించేవారిపైనా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. వెర్రితలలు వేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని ఇందుకు సంబంధించి భారత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించాయి.

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ, రష్యా విదేశాంగ మంత్రి సెర్జి లవరోల మధ్య రెండు గంటల పాటు రిక్ దేశాల 13వ వార్షిక సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి వీలుగా సభ్యదేశాలు సమాచారాన్ని పంచుకోవాలని అలాగే ఇంటర్నెట్, ఇతర సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు తీవ్రవాదులకు అందకుండా నిరోధక చర్యలు చేపట్టాలని ముగ్గురు నేతలూ నిర్ణయించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతం చేయాలని ఏ విధంగానూ పెడధోరణలను అనుమతించకూడదని చర్చల అనంతరం జారీ చేసిన సంయుక్త ప్రకటనలో వారు పేర్కొన్నారు.

English summary
Chinese President Xi Jinping on Monday met external affairs minister Sushma Swaraj here and said China and India have taken "solid steps" to step up cooperation and implement the agreements reached between him and Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X