షాకింగ్: మట్టల ఆదివారం నాడు చర్చి వద్ద ఆత్మాహుతి దాడి -ఇండోనేషియాలో టెర్రరిస్టుల ఘాతుకం -భారీగా బాధితులు
ప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న ఇండోనేషియాలో మరోసారి చర్చిలు టార్గెట్ అయ్యాయి. ఈస్టర్ పవిత్ర వారం ప్రారంభదినమైన మట్టల ఆదివారం నాడు క్రైస్తవులే లక్ష్యంగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడితో కలకలం సృష్టించారు. స్థానిక పోలీసులు చెప్పిన వివరాలివి..
ఇండోనేషియాలోని సులవేసి దీవిలో అతిపెద్ద నగరమైన మకస్సార్ లో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. స్థానిక రోమన్ క్యాథలిక్ చర్చిపై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. ప్రస్తుతానికి గాయపడిన 14 మందిని పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. ఇవాళ మట్టల ఆదివారం కావడంతో చర్చికి పెద్ద సంఖ్యలో జనం చేరుకున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ

పేలుడు పదార్థాలు నింపిన బైక్ ను నడుపుతూ ఓ ఫిదాయీ చర్చి గేటు గుండా లోనికి ప్రవేశించే ప్రయత్నం చేయగా, అతణ్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తీవ్రవాది తనను తాను పేల్చుకోవడంతో అక్కడ భారీ విస్పోటనం జరిగింది. అప్పటికే ప్రార్థన ముగించుకుని జనం బయటికి వస్తుండగా, పేలుడు శకలాలు తగిలి చాలా మందికి గాయాలయ్యాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది శరీరం తునాతునకలైంది.
viral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలు

దక్షిణ సులవేసి ప్రావిన్స్ రాజధాని మకస్సార్లోని రోమన్ కేథలిక్ చర్చి వద్ద పేలుడు ఘటనతో పోలీసులు అలెర్టయ్యారు. చర్చి పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10:35 గంటలకు పేలుడు జరిగిందని దక్షిణ సులవేసి పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటిదాకా ప్రకటన రాలేదు. అయితే, ఐసిస్ తరహాలో ఇండోనేషియాలో వ్యాప్తికి ప్రయత్నిస్తోన్న జమా అన్షరుత్ దౌలా(జేఏడీ) గ్రూపే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.