వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియా సంక్షోభం: 80 వేల మంది వెనక్కి

|
Google Oneindia TeluguNews

స్వీడన్: సిరియా సంక్షోభం నేపథ్యంలో నిత్యం పెరిగిపోతున్న వలసదారులతో యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా స్వీడన్ లోకి ప్రవేశించిన 80 వేల మంది వలసదారులను వెనక్కి పంపించాలని నిర్ణయం తీసుకున్నాయి.

2015లో మొత్తం 1,63,000 మంది ప్రజలు స్వీడన్ ను ఆశ్రయం కోరారు. అయితే అన్ని పరిశీలించిన అధికారులు వారిలో సగం మందికి ఆశ్రయం కల్పించి మిగిలిన వారిని వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

Sweden to expel up to 80,000 failed asylum seekers

ఈ సందర్బంలో 80 వేల మంది వలసదారులను వెనక్కి పంపించాలని తాము నిర్ణయించామని స్వీడన్ అధికారి ఆండ్రస్ విజిమెన్ అన్నారు. ఇప్పటికే తాము 60 వేల నుంచి 80 వేల మందిని వెనక్కు పంపించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

సిరియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల వలసదారుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. అందరూ స్వీడన్ లో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వలసదారులను నియంత్రించడానికి సరిహద్దులోతాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జర్మనీతో పాటు స్వీడన్ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నది.

English summary
Anders Ygeman said that charter aircraft would be used to deport the migrants over several years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X