వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందడుగు: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల లిస్ట్ సిద్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

జ్యూరిచ్/న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో భారత్‌కు పెద్ద ఊరట! స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నల్లధనం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కూడా సారించింది. తాజాగా.. స్విట్జర్లాండ్ ప్రభుత్వం తమ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల జాబితాను సిద్ధం చేసింది.

స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను భారత ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందజేసే అవకాశముందని సమాచారం. స్విస్ బ్యాంకుల్లో ఖాతాల జాబితాలో భారత దేశంది 58వ స్థానం. కాగా, ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉందని సమాచారం.

Swiss govt prepares list of Indians with suspected black money

భారత్‌కు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు ట్యాక్స్ కట్టకుండా స్విస్ బ్యాంకుల్లో తన ధనాన్ని దాచిపెట్టారు. వ్యక్తులు, సంస్థల పేర్లు వెల్లడించేందుకు స్విస్ ప్రభుత్వం అధికారులు నిరాకరించారట. అయితే భారత్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని, అలాగే అవసరమైతే కేంద్రం వేసిన సిట్‌కు సహకరిస్తామని చెప్పారట.

కాగా, స్విట్జర్లాండ్‌ బ్యాంకులలో భారతీయుల డబ్బు రెండు బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లకు పైగా (సుమారు రూ. 14వేల కోట్ల మేరకు) పెరిగినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకింగ్‌ ప్రాధికార సంస్థ స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బి) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, స్విస్‌ బ్యాంకులలో భారతీయులు దాచుకున్న నిధులు 2012లోని దాదాపు 1.42 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌ల నుంచి 2013లో 40 శాతంపైగా పెరిగాయి.

అయితే, ప్రపంచవ్యాప్తంగా విదేశీ ఖాతాదారులు స్విస్‌ బ్యాంకులలో డిపాజిట్‌ చేసిన డబ్బు తగ్గుముఖం పడుతూనే ఉంది. ఇది 2013 సంవత్సరాంతానికి గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా 1.32 ట్రిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు (దాదాపు 1.56 ట్రిలియన్‌ డాలర్లు లేదా రూ. 90 లక్షల కోట్లు) మేర ఉంది. 2012లో స్విస్‌ బ్యాంకులలో భారతీయుల డబ్బు ఇది వరకు ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి మూడింట ఒక వంతు మేర క్షీణించింది.

2013 సంవత్సరాంతానికి స్విస్‌ బ్యాంకులోని భారతీయుల మొత్తం డబ్బులో వారు వ్యక్తిగతంగాను, సంస్థలుగాను స్విస్‌ బ్యాంకులలో దాచుకున్న 1.95 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు, విశ్వాసపాత్రులు లేదా వెల్త్‌ మేనేజర్ల ద్వారా జమ చేసిన అదనపు సొమ్ము 77.3 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు కూడా చేరుకున్నాయి.

విదేశీ ఖాతాదారుల వివరాలను తమకు అందజేయాలని ఇండియా, పలు ఇతర దేశాల నుంచి స్విట్జర్లాండ్‌ అంతకంతకు ఒత్తిడిని ఎదుర్కొంటుండగా తమ దేశంలోని శాసనకర్తలు అటువంటి చర్యలను ప్రతిఘటిస్తున్న సమయంలో జ్యూరిచ్‌ కేంద్రంగా గల ఎస్‌ఎన్‌బి ఈ తాజా డేటాను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌ వంటి దేశాలలో భారతీయులు అక్రమంగా దాచుకున్న నిధులతో సహా నల్ల ధనం కేసులపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను కూడా ఇండియా ఏర్పాటు చేసింది.

స్విస్‌ బ్యాంకుల అప్పులు లేదా తమ క్లయంట్లకు బకాయి పడిన మొత్తాలుగా ఎస్‌ఎన్‌బి అభివర్ణించిన ఆ నిధులు స్విస్‌ అధికారులు వెల్లడి చేసిన అధికారిక గణాంకాలు. విస్తృతంగా చర్చ జరుగుతున్నట్లు స్విట్జర్లాండ్‌లోని సురక్షిత ధనాగారాలలో భారతీయులు దాచుకున్న నల్ల ధనం మొత్తాన్ని అవి సూచించడం లేదు.

భారతీయులు లేదా ఇతరులు వివిధ దేశాలకు చెందిన సంస్థల పేరిట స్విస్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బును కూడా ఎస్‌ఎన్‌బి అధికారిక గణాంకాలలో చేర్చలేదు. స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల దృష్టి విదేశీ క్లయంట్ల నుంచి దేశీయ వ్యాపారంపైకి మళ్లిస్తూనే ఉన్నట్లు ఎస్‌ఎన్‌బి తెలియజేసింది. విదేశీ ఖాతాదారులకు చెల్లించవలసి ఉన్న మొత్తం నిధులలో తగ్గుదల దీనిని ప్రతిబింబిస్తోంది.

స్విట్జర్లాండ్‌లో మొత్తం 283 బ్యాంకులు ఉన్నాయి. 2013 సంవత్సరారంభంలో వీటి సంఖ్య సుమారు 300గా ఉంది. అంటే బ్యాంకుల సంఖ్య తగ్గిందన్నమాట. వాటిలో రెండు బ్యాంకులను (యుబిఎస్‌, క్రెడిట్‌ స్విస్‌లను) పెద్ద బ్యాంకులుగా వర్గీకరించారు. స్విట్జర్లాండ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 93 విదేశీ బ్యాంకులు ఉన్నాయి. ఆ మొత్తం బ్యాంకులలో సుమారుగా లక్షా పాతిక వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు.

English summary
In a major boost to India’s fight against black money, Switzerland has prepared a list of Indians suspected to have stashed un-taxed wealth in Swiss banks and the details are being shared with Indian government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X