ఐఫోన్ పేలిపోయింది: గాయాలతో బచావ్

Posted By:
Subscribe to Oneindia Telugu

సిడ్నీ: ఐ ఫోన్ 6 పేలిపోవడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలై ఆసుపత్రిపాలైనాడు. ఆస్ట్రేలియాలో ఈ సంఘటన జరిగింది. సిడ్నీకి చెందిన మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ గారెత్ క్లియర్ (36) అనే వ్యక్తికి గాయాలైనాయి.

గారెత్ క్లియర్ ఇటీవల ఐ ఫోన్ 6 కొనుగోలు చేశాడు. ఇతను ఐ ఫోన్ ను ప్యాంట్ బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకుని బైక్ లో పని మీద బయలుదేరాడు. మార్గం మధ్యలో ఐ ఫోన్ నుంచి మంటలు వ్యాపించాయి. ఆందోళన చెందిన గారెత్ క్లియర్ బైక్ లో నుంచి కింద పడిపోయాడు.

ఆ సందర్బంలో ఐ ఫోన్ పేలిపోయింది. అతని కుడికాలి తొడ భాగం కాలిపోవడంతో గాయాలైనాయి. వెంటనే అతనిని సిడ్నీలోని రాయల్ నార్త్ షోర్ ఆసుపత్రికి తరలించారు. గారెత్ క్లియర్ స్క్రీన్ గ్రాఫ్ట్ సర్జరీ చేయించుకున్నారని ది డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది.

sydney bike rider left with third-degree burns after iPhone

బ్యాటరీలోని లిథియం కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఫోన్ల తయారి సంస్థలు నిర్లక్షం కారణంగానే ఇలా జరిగిందని, తనకు గాయాలైనాయని, ఫోన్లు వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాలని గారెత్ క్లియర్ సూచించాడు.

అతను తనకు అయిన గాయం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఫోటోలు తీసి ట్వీట్టర్ లో పోస్టు చేశాడు. ఈ విషయంపై యాపిల్ సంస్థ స్పందించింది. దీనిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The burn was so severe he had to undergo skin graft surgery at the burns unit of the Royal North Shore Hospital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి