సిరియాలో ఆత్మాహుతి దాడి.. పేలిన కారు బాంబు, 39 మంది మృతి
సిరియాలోని అలెప్పో నగర శివారులో శనివారం జరిగిన బాంబు పేలుడు 39 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
డమాస్కస్: సిరియా మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. శనివారం అలెప్పో నగర శివారులో జరిగిన ఈ పేలుడులో 39 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా సిరియా ప్రభుత్వం అనుమానిస్తోంది.
అలెప్పోకు వెళ్తున్న ఓ బస్సును నగర శివారులో ఆపి ఉంచిన సమయంలో.. దానికి సమీపంలో ఆత్మాహుతి దళ సభ్యుడు కారు బాంబును పేల్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి ఓ బస్సు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఈ పేలుడులో ప్రయాణికుల మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications