వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియా షాక్: తిండి దొరక్క గడ్డి తిని బతుకుతున్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీరుట్: సిరియాలోని మదయాలో డిసెంబర్ 25వ తేదీ నుంచి 23 మంది ప్రజలు ఆకలితో చనిపోయారని తెలుస్తోంది. అసద్ ఫోర్స్ మరియు హిజబుల్లాలు సీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలకు ఆహారం సరఫరా కావడం లేదు.

గత ఏడాది అక్టోబర్ నెల నుంచి ప్రజలకు ఆహారం సరిగా సరఫరా కావడం లేదు. దీంతో ఇక్కడి ప్రజలు బలవంతంగా గడ్డిని, పిల్లులను తింటూ బతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతంలో పలు సహాయక ఏజెన్సీలు రంగంలోకి దిగుతున్నాయి.

డిసెంబర్ 1వ తేదీ నుంచి 23 మంది మృతి చెందారని వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చింది. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా వచ్చాయి. ఎన్నో రోజులుగా ఆహారం లేక బలహీనంగా, బక్కచిక్కిన ప్రజల ఫోటోలు ఉన్నాయి. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.

Syrian crisis: People survive on cats and grass, says Report

ఆ ప్రాంతం ఓపెన్ ఎయిర్ జైలులో మారిందంటున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎవరైనా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే టౌన్ మొత్తం ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్ల వల్ల గాయపడటం లేదా చనిపోవడం జరుగుతోంది. సిరియా సంక్షోభం వల్ల ఇప్పటికే అక్కడి నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి పోవడం లేదా చనిపోవడం జరిగింది.

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు: యార్లూప్‌లో 95 ఇళ్లు దగ్ధం

ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలో కార్చిచ్చు వేల ఎకరాలను దహించింది. పెర్త్‌ దక్షిణ ప్రాంతంలోని యార్లూప్‌ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. 95 ఇళ్లు దగ్ధమయ్యాయి. ముగ్గురు వ్యక్తుల ఆచూకీ తెలియకుండా పోయింది. మంటలు విపరీతంగా వ్యాపిస్తూ ఆందోళనకరంగా మారాయి. దాదాపు 58వేల హెక్టార్లు అగ్నికి ఆహుతయ్యాయి.

English summary
At least 23 people including infants have been died of starvation in Syrian city of Madaya since December, 2015, media reported. Because of the siege of Assad forces and Hizbollah, food supply has not been reached in the area since October last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X