ఘోర రోడ్డు ప్రమాదం: బస్సులో మంటలు, 26 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

తైపీ: తైవాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌తో సహా 26 మంది మృతి చెందిన ఘ‌ట‌న తైవాన్‌ రాజధాని తైపీలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉద‌యం రెండో నంబర్‌ జాతీయ రహదారిపై మీదుగా తావోయువాన్‌ విమానాశ్రయానికి ప‌ర్యాట‌కుల వెళుతోన్న బస్సు అదుపుతప్పి బారియ‌ర్ల‌ను ఢీకొట్ట‌ింది.

 Taiwan tourist bus fire kills all 26 on board

దీంతో బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. డోర్లు తెరిచేంత సమయం కూడా లేకుండా అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి. దీంతో బ‌స్సులో ప్రయాణిస్తున్న 26 మంది మృతి చెందగా, మ‌రికొంత‌మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంట సేపు శ్రమించి మంటలను అదుపు చేశారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రవేశద్వారం వద్ద మృతదేహాలు కుప్పలుగా పడి ఉండటాన్ని బట్టి చూస్తే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వారంతా బయటకు వచ్చే ప్రయత్నం చేసుంటారని పోలీస్ క్లూస్ టీమ్ సభ్యులు నిర్ధారించారు.

 Taiwan tourist bus fire kills all 26 on board

చనిపోయిన వారిలో 16 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. బస్సులో ప్ర‌యాణిస్తోన్న వారంతా చైనాకి చెందిన ప‌ర్యాట‌కులేన‌ని పోలీసులు వివరించారు. మంటలు చెలరేగటానికి ముందు బస్సు రోడ్డుకు ఒక పక్కగా వెళ్లిందని, అలా ఎందుకు వెళ్లిందీ, మంటలు ఎలా చెలరేగింది అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A tour bus carrying visitors from China has caught fire on a busy highway near Taiwan’s capital, killing all 26 people on board, officials said, in the deadliest incident involving Chinese tourism to the island.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X