బ్రిటన్‌లో అతి పిన్న వయస్కుడైన సూసైడ్ బాంబర్
న్యూఢిల్లీ: బ్రటన్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌కు కుటుంబానికి చెందిన 17 ఏళ్ల యువకుడిని బ్రిటన్ అధికారులు ఐఎస్ఐఎస్‌లో చేరి హతమైన అతి పిన్న వయస్కుడు ఇతడేనని నిర్ధారించారు. అతని పేరు తల్హా అస్మాల్.
ఐఎస్ఐఎస్‌పై మక్కువతో బ్రిటన్ నుంచి వెళ్లి సూసైడ్ బాంబర్‌గా మారి ఇటీవల ఇరాక్‌లోని బైజీ పట్టణంలో జరిపిన ఆత్మాహుతి దాడిలో తనను తాను పేల్చేసుకున్నాడు. ఇదేవిషయాన్ని ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో పోస్టు చేశారు.
ఇరాక్‌లోని దక్షిణ బైజీ పట్టణంలో ఉన్న ఆయిల్ రిఫైనరీపై దాడి చేసిన నలుగురు సూసైడ్ బాబంర్లలో ఇతను కూడా ఉన్నాడని తెలిపారు. బ్రిటన్ అధికారుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న అస్మాల్ తల్లిదండ్రులు వారి విచారాన్ని వ్యక్తం చేశారు.

అమెరికా వెళ్లి వస్తానని చెప్పిన తమ కొడుకు ఇరాక్‌కు వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరడమేమిటంటూ అవాక్కయ్యారు.ఐఎస్ఐఎస్ అనే ఉగ్రవాద సంస్ధ ఇస్లాం లేదా ముస్లింలకు ప్రాతినిధ్యం వహించడం లేదని తెలిపారు.
కానీ ఆ రూపాన్ని సంతరించుకుంటుందని అన్నారు. ఏప్రిల్ నెలలో తన స్నేహితుడు హస్సాన్ మన్షీ (17)తో కలిసి టర్కీకి వెళ్లినట్లు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ జెండా ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉన్న తమ కొడుకు ఫోటో ఐఎస్‌ఐఎస్ మీడియా ప్రచురించిందంటూ బ్రిటన్ మీడియాలో వార్తలు రావడంతో ఖంగుతిన్నారు.
అస్మాల్ కుటుంబం పాకిస్ధాన్ నుంచి వచ్చి బ్రిటన్‌లో స్ధిరపడ్డారు. కాగా, 2005 జులై 7న లండన్ బస్సులో తనకు తానే పేల్చేసుకున్న 19 ఏళ్ల హసీబ్ హుస్సే తర్వాత అంతకన్నా తక్కువ వయసు కలిగిన పిల్లలు సైతం ఉద్రవాదం పట్ల ఆకర్షితులవుతుండడం ఆందోళన కలిగిస్తుందని బ్రిటన్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications