మహిళలపై తాలిబన్ల కొత్త ఆంక్షలు- సుదూర ప్రయాణాలకు వారు తప్పనిసరిగా ఉండాల్సిందే
ఆప్ఘనిస్తాన్ లో మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనల నేపథ్యంలో తాలిబన్ల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు సుదూర ప్రయాణాలు చేసే విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం సుదూర ప్రయాణాలు చేయాలనుకునే మహిళలు పురుషులను తప్పనిసరిగా తోడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందులోనూ ఆంక్షలున్నాయి.
ఆప్ఘన్ లో తాలిబన్ల తాజా ఉత్తర్వుల ప్రకారం సుదూర ప్రయాణాలు చేయాలనుకునే మహిళలకు దగ్గరి మగ బంధువు తోడుంటే తప్ప రోడ్డు రవాణా సౌకర్యం కల్పించరాదని నిర్ణయించారు. అలాగే రవాణా వాహనాల డ్రైవర్లు మగ బంధువు తోడు లేని వారిని తమ వాహనాల్లో ఎక్కించుకోరాదని, అలాగే వారు మొహానికి బురఖా ధరించకపోతే కూడా ప్రయాణాలకు అనుమతించరాదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో తాలిబాన్ ప్రభుత్వ రంగ పాత్రల్లో ఉన్న చాలా మంది మహిళలను తిరిగి పనికి రాకుండా నిషేధించారు. అలాగే బాలికలను పాఠశాల విద్యకు దూరంగా ఉంచారు.

తాలిబన్ల ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. 45 మైళ్ళు (72 కిలోమీటర్లు) కంటే ఎక్కువ దూరం ప్రయాణించే స్త్రీలు తమ దగ్గరి కుటుంబ సభ్యుడు లేకుంటే వారిని ప్రయాణాలకు అనుమతించరు.. అలాగే కచ్చితంగా సదరు పురుషులు వారి దగ్గరి బంధువుగా స్త్రీలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడైనా తేడా వస్తే అంతే సంగతులు. మరోవైపు తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మహిళలకు మరింత స్వేచ్ఛ నిస్తామని ప్రకటించారు. అయితే నిషేధాజ్ఞల పరంపర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో మానవ హక్కుల సంస్ధలు దీనిపై తమ నిరసన తెలుపుతున్నారు.
అలాగే మరో కొత్త మార్గదర్శకం ప్రకారం ప్రజలు తమ వాహనాల్లో సంగీతాన్ని ప్లే చేయడం మానేయాలని కూడా తాలిబన్లు ఆదేశాలు ఇచ్చారు. కొన్ని వారాల క్రితం, మంత్రిత్వ శాఖ ఆఫ్ఘనిస్తాన్ టెలివిజన్ ఛానెల్‌లను మహిళా నటీనటులు నటించిన డ్రామాలు మరియు సోప్ ఒపెరాలను ప్రదర్శించడాన్ని నిలిపివేయాలని కోరింది. మహిళా టీవీ జర్నలిస్టులు కూడా తలకు స్కార్ఫ్ ధరించి ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. రవాణా కోరుకునే మహిళలకు కూడా హిజాబ్, ఇస్లామిక్ హెడ్‌స్కార్ఫ్ అవసరం అని తాలిబన్ల ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications