తాలిబన్ల సంచలన నిర్ణయం-9/11నే ప్రభుత్వ ఏర్పాటు-అమెరికాపై దాడులకు 20 ఏళ్లయిన వేళ
2001లో అమెరికాలో వారికే చెందిన నాలుగు విమానాలను హైజాక్ చేసి డబ్లూటీసీ టవర్స్, పెంటగాన్ సహా పలు కీలక టార్గెట్లపై తీవ్రవాద సంస్ధ అల్ ఖైదా దాడులు చేసింది. ఇవి 9/11 దాడులుగా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటివరకూ అమెరికా బయటపెట్టలేదు. అలాంటి 9/11 రోజునే అల్ ఖైదాతో సత్సంబంధాలు నెరుపుతున్న తాలిబన్లు తమ కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
రెండు రోజుల కోసం ఆప్ఘనిస్తాన్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఎవరెవరుంటారనే దానిపై వివరాలు ప్రకటించిన తాలిబన్లు... ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు చేస్తారనే దానిపై ఇంకా చర్చలు జరుపుతున్నారు. హడివిడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకపోవడంతో తాలిబన్లు... ఇందుకోసం మంచి ముహుర్తం కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై అల్ ఖైదా దాడులు చేసి వారి అహంకారంపై దెబ్బ కొట్టిన 9/11 రోజునే తమ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందని తాిబన్లు ఆలోచిస్తున్నారు.

9/11 రోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీన తమ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా అమెరికాకు గట్టి సంకేతాలు పంపినట్లు అవుతుందని తాలిబన్లు భావిస్తున్నారు. ఇందుకోసమే 9/11 ముహుర్తాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది ప్రకటన మాత్రం చేయలేదు. ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారో ప్రకటించి రెండు రోజులు గడిచినా ఇంకా ప్రమాణ స్వీకార వివరాలు ప్రకటించకపోవడం వెనుక కారణం కూడా ఇదే అయి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది ముందుగా దీన్ని ప్రకటించకుండా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుని ఆ రోజే ప్రమాణ స్వీకారం పెట్టే దిశగా తాలిబన్లు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో అమెరికా తమపై దాడులు చేసిందన్న కోపంతో అల్ ఖైదాపై దాడిలో భాగంగానే వారి మిత్రులైన తాలిబన్ల సర్కార్ ను కూలదోసింది. ఆఫ్ఘన్ పై దాడులు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కూడా అక్కడే పాగావేసి ప్రజా ప్రభుత్వం పేరుతో అష్రఫ్ ఘనీ సర్కారును నడిపించింది. కానీ కరోనాతో పాటు ఇతర సమస్యలు వెంటాటడంతో తాలిబన్లతో సుదీర్ఘ పోరాటం చేయలేక చేతులెత్తేసింది. శాంతి ఒప్పందం చేసుకుని ఆప్ఘన్ ను వీడిపోయింది. ఇప్పుడు అమెరికాపై ఉన్న కోపంతో 9/11 రోజున కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేసుకుంటున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications