కిర్గిజిస్తాన్ లో ఏపీ విద్యార్థులపై దాడులు-టీడీపీ నేతలు రామ్మోహన్, భరత్ భరోసా-సేఫ్టీపై ఆందోళన..!
ఏపీ నుంచి మధ్య ఆసియా దేశం కిర్గిజిస్తాన్ వెళ్లి చదువుకుంటున్న పలువురు విద్యార్ధులకు తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు చుక్కలు చూపిస్తున్నాయి. మే 13న స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ లో జరిగిన ఈ ఘటన తర్వాత స్థానిక విద్యార్ధులు వర్సెస్ విదేశీ విద్యార్ధులుగా పరిస్ధితి మారిపోయింది. దీంతో హాస్టళ్ల గొడవలు కాస్తా రోడ్లపైకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ యువ నేతలు రామ్మోహన్ నాయుడు, శ్రి భరత్ వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు.
కిర్గిజిస్తాన్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన పలువురు విద్యార్ధులతో రామ్మోహన్ నాయుడు, శ్రీభరత్ వీడియో కాల్ లో మాట్లాడారు. అక్కడి పరిస్ధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తో పాటు విదేశాంగ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశామని, వారు ఎంబసీతో మాట్లాడుతున్నారని తెలిపారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

టీడీపీ నేతలతో వీడియో కాల్ లో మాట్లాడిన ఏపీ విద్యార్దులు.. స్ధానికంగా ఉంటున్న కొందరు ఈ మధ్యే రాడ్లతో వచ్చి తమను భయబ్రాంతుల్ని చేశారని పేర్కొన్నారు. ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగాల విషయంలోనూ ఇబ్బందులు పెడుతున్నారని, అంతిమంగా తమను కిర్జిజిస్తాన్ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. అక్కడ హాస్టళ్లలో నెలకున్న తాజా పరిస్ధితుల్ని టీడీపీ నేతలకు విద్యార్ధులు వివరించారు. దీంతో సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించాలని వీరు సూచించారు.
Telugu students say scary situation prevailing in Kyrgyzstan following attacks on foreign students by the locals
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) May 20, 2024
TDP Srikakulam MP Rammohan Naidu and TDP vizag MP candidate M Bharat speaking to medical students form AP over video conference call in Kyrgyzstan pic.twitter.com/l5WbG1QcCz
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
భారత్ న్యూస్ కవర్ చేసిన పాక్ ఛానెల్.. అక్కడి ప్రభుత్వం ఏం చేసిందంటే..? -
పాక్ పరువు గంగలో.. అప్పుల అప్పారావుకు అంతర్జాతీయ అవమానం! -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications