పాఠాలు చెప్పేందుకు వచ్చిన టీచర్‌పై అత్యాచారం

Teacher sexually assaulted by a prisoner
అరిజోనా: నేరస్తులకు పాఠాలు చెప్పేందుకు వచ్చిన ఓ టీచర్‌పై ఖైదీ అత్యాచారం చేసి ఆపై ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలోని అరిజోనా జైల్లో చోటుచేసుకుంది.

ఈ సంఘటన గత జనవరిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని అరిజోనా జైల్లో లైంగిక నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైధీలను మంచి మనుషులుగా మార్చే ప్రక్రియలో భాగంగా ఓ టీచర్ వారికి అక్కడ ఓ గదిలో పాఠాలు చెబుతోంది.

ఆ క్లాస్ అయిపోయిన అనంతరం వాళ్లలో మిగిలిన వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఒక్క ఖైదీ మాత్రం ఉండిపోయాడు. అతడు ఒంటరిగా ఉన్న టీచర్‌పై అత్యాచారానికి పాల్పడి ఆపై కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు.

అతడు గతంలో ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష అనుభివిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం జైలు అధికారులు మేల్కొని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం పర్యావేక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+