వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: క్లాస్ రూమ్ తుడవలేదని 3 అంతస్థునుండి తోసేశారు

పాఠశాలకు వచ్చేది చదువుకోవడానికి కానీ, తరగతి గదులను శుభ్రం చేయడానికి కాదు అనే విషయాన్ని చెప్పిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిని మూడో అంతస్థు నుండి కిందకు తోసేశాడు స్కూల్ టీచర్లు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లాహోర్: పాఠశాలకు వచ్చేది చదువుకోవడానికి కానీ, తరగతి గదులను శుభ్రం చేయడానికి కాదు అనే విషయాన్ని చెప్పిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిని మూడో అంతస్థు నుండి కిందకు తోసేశాడు స్కూల్ టీచర్లు. ఆ బాలిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకొంది.

పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఫజ్టర్ నూర్ అనే 14 ఏళ్ళ బాలిక చావుబతుకుల మధ్య లాహోర్ నగరంలోని ఘర్కి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఆమెకు పలుచోట్ల ఫ్రాక్చర్లయ్యాయి.అంతేకాదు వెన్నెముక కూడ విరిగిపోయింది.

Teachers Push Pak Schoolgirl From 3rd Floor For Refusing to Clean Classroom

తరగతి గదులను ప్రతిరోజూ ఒక్కో విద్యార్థిని శుభ్రం చేయాలని. మే 23వ, తేదిన ఫజ్జర్ వంతు. అయితే ఆ రోజు ఆమెకు ఆరోగ్యం బాగలేదు. మరో రోజు ఆ పనిచేస్తానని ఆమె చెప్పింది. దీంతో టీచర్లు ఆమెను మరోగదిలోకి తీసుకెళ్ళి కొట్టారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మూడో అంతస్థుపైకి తీసుకెళ్ళి అక్కడ శుభ్రం చేయాలని కోరారు.

ఆరోగ్యం బాగాలేదని విద్యార్థిని చెప్పింది. దీంతో కోపంతో మూడో అంతస్థు నుండి ఆహెను తోసేశారని ఫజ్జర్ చెప్పారు. దాంతో ఇద్దరు టీచర్లు రెహానా కౌర్, బుష్రా తుపైల్ అనే ఇద్దరిపై హత్యాయత్నం కేసు పెట్టారు.

మే 23వ, తేదిన ఈ ఘటన జరిగినా స్కూల్ యాజమాన్యం దాచిపెట్టింది. పంజాబ్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అల్లాబక్ష్ మాలిక్ చెప్పారు. ఎట్టకేలకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీని

ముఖ్యమంత్రి నియమించారు. అయితే సీఏం స్వయంగా వచ్చి తన కూతురిని చూడాలని బాధితురాలి తల్లి రుఖ్సానా బీబీ డిమాండ్ చేశారు.

English summary
A 14 yearold Pakistani girl was allegedly pushed by two of her teachers from the rooftop of a school building in the Punjab province for refusing to clean the classroom, a media report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X