షాకింగ్: ఐఫోన్ కోసం కన్యత్వాన్నే వేలానికి పెట్టింది.. చివరికి...
ఖరీదైన స్మార్ట్ ఫోన్ల కోసం నేటి యువత ఎంతకైనా తెగిస్తున్నారనడానికి సాక్ష్యం ఈ ఉదంతం. చైనాకు చెందిన క్సియో చాన్ అనే యువతి ఐ ఫోన్ 8 కోసం ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది.
బీజింగ్: ఖరీదైన స్మార్ట్ ఫోన్ల కోసం నేటి యువత ఎంతకైనా తెగిస్తున్నారనడానికి సాక్ష్యం ఈ ఉదంతం. చైనాకు చెందిన క్సియో చాన్ అనే యువతి ఐ ఫోన్ 8 కోసం ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో క్సియో చాన్ పెట్టిన పోస్టు చూసిన నెనా అనే బ్లాగర్ ఆమెకు తగిన గుణపాఠం నేర్పాలని భావించింది. ఎందుకంటే, ఒక ఫోన్ కోసం కన్యత్వాన్నే ఫణంగా పెట్టడం నెనాకు నీచంగా అనిపించింది.
ఈ క్రమంలో నెనా ఫోన్ లో క్సియో చాన్ ను సంప్రదించింది. తన బాస్ ఐఫోన్ ఇస్తాడని.. అందుకు ప్రతిగా అతడికి సహకరించాలని చెప్పింది. ఇంకేముంది, క్సియో చాన్ ఎగిరి గంతేసి దీనికి ఒప్పుకుంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.
నెనా తన ఆఫీసు సిబ్బందిలో ఒకరిని బాస్ పాత్రకు ఎంపిక చేసి క్సియో చాన్ ఉన్న గదిలోకి పంపించింది. అతడు తాను తీసుకొచ్చిన ఐఫోన్ బాక్స్ ను ఆమెకు అందించాడు.
అంతలో - షార్ట్స్ ధరించిన, కండలు తిరిగిన ఇద్దరు వ్యక్తులు వారు ఉన్న గదిలోకి ప్రవేశించారు. వస్తూనే క్సియో చాన్ ను మంచానికి కట్టేసి, వీడియో తీయడం ప్రారంభించారు.
దీంతో తీవ్రంగా బెదిరిపోయిన క్సియో చాన్.. ఐఫోన్ బాక్స్ ను బాస్ కు తిరిగిచ్చేసి.. తనను వదిలేయాలని వేడుకుంటూ ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఆ సమయంలో రంగ ప్రవేశం చేసిన నెనా ఆమెను ఓదార్చి.. అదంతా డ్రామా అని చెప్పింది.
ఆఫ్ట్రాల్ ఐఫోన్ కోసం శీలాన్నే వేలం వేయాలనుకోవడం వెర్రితనమని, కేవలం బుద్ధి చెప్పేందుకు తాను ఈ నాటకం ఆడించానని క్సియో చాన్ కు చెప్పేయడంతో.. ఆమె కూడా ఇంకెప్పుడూ తాను ఇలాంటి వెధవ పనులు చేయనని నెనాకు ప్రామిస్ చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications