Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హృదయ విదారకం: తండ్రిని బతికించేందుకు ఆమె వేశ్యగా మారింది!

తన తండ్రి ప్రాణాలను దక్కించుకునేందుకు ఏ కూతురు చేయలేని పనిని చేసేందుకు సిద్ధపడింది ఆ అమ్మాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి ప్రాణాలు దక్కాలంటే ఆయనకు లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయాలన్నా

దుబాయ్: తన తండ్రి ప్రాణాలను దక్కించుకునేందుకు ఏ కూతురు చేయలేని పనిని చేసేందుకు సిద్ధపడింది ఆ అమ్మాయి. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి ప్రాణాలు దక్కాలంటే ఆయనకు లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయాలన్నారు వైద్యులు. దీంతో ఎంత కష్టపడినా అంత మొత్తం రాదని తెలిసింది. దూరపు బంధువుల సూచనతో ఎక్కువ డబ్బులు సంపాదించి తన తండ్రి ప్రాణాలను దక్కించుకునేందుకు ఆ యువతి ఏకంగా తన శరీరాన్ని అమ్ముకునేందుకు నిర్ణయించుకుంది. ఈ హృదయ విదారక ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఆ అమ్మాయి(17) తన తండ్రితో కలిసి మూడునెలల క్రితం దుబాయ్‌కి వెళ్లింది. అక్కడ ఆ అమ్మాయి దగ్గరి బంధువు ఉంటోంది. ఆమె దగ్గరే ఉంటూ ఏదైన పనిచేసి తన తండ్రికి గుండె ఆపరేషన్ చేయిద్దామనుకుంది. తండ్రి ఆపరేషన్‌కు 80000 దిర్హమ్స్(భారత కరెన్సీ ప్రకారం రూ.14,15,589) ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.

Teen became sex worker to pay for dad’s heart surgery

అంత డబ్బు సంపాదించాలంటే మంచి సంపాదన ఉండాలి. అయితే ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. దీంతో మంచి ఉద్యోగం కూడా దొరికే అవకాశం లేదని ఆమెకు బంధువులు చెప్పారు. ఆమెకు అక్కడ ఉద్యోగం దొరికినా తండ్రి ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు సంపాదించడానికి చాలా రోజులు పడుతుందని చెప్పింది ఆమెకు సోదరి అయ్యే మరో అమ్మాయి తెలిపింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి తన దగ్గర మంచి మార్గం ఉందని, వ్యభిచారం చేస్తే ఇది సాధ్యమవుతుందని తెలిపింది.

అలా చేస్తే కొద్దిరోజుల్లోనే తండ్రికి ఆపరేషన్ చేయించొచ్చని ఆ అమ్మాయిని నమ్మించింది. దీంతో వేరే మార్గం ఏమీ లేకపోవడంతో ఆ అమ్మాయి కూడా అందుకు అంగీకరించింది. రోజుకు 500-600 దిర్హమ్స్(భారత కరెన్సీ ప్రకారం రూ. 8,847.77) సంపాదించవచ్చంటూ ఆ అమ్మాయికి ఆశలు కల్పించింది. తండ్రికి ఆ విషయం తెలిస్తే అంగీకరించడని, ఆయన విజిట్ వీసా గడువు ముగిసేంత వరకు వేచి చూసింది.

గడువు ముగిశాక, ఆయనను స్వదేశానికి పంపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి సోదరి ఒక వ్యక్తిని ఆమెకు పరిచయం చేసింది. ఆ వ్యక్తి ఆమెను వివిధ హోటళ్లకు తీసుకువెళ్లేవాడు. అక్కడ ఆమెతో వ్యభిచారం చేయించేవాడు. అయితే ఒక రోజు పోలీసులు ఆమె ఉన్న హోటల్‌పై రైడ్ చేసినప్పుడు ఆమె వారికి పట్టుబడింది. అతడు మాత్రం తప్పించుకున్నాడు. కాగా, ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.

కోర్టులో ఆమె వ్యభిచారం చేసినట్టు ఒప్పుకుంది. తన తండ్రిని రక్షించుకోవడానికే ఆ పనిచేశానని చెప్పింది. తనకు ఇద్దరు వ్యక్తులు సహకరించారని చెప్పింది. కొద్దిరోజుల్లోనే పోలీసులు, ఆ వ్యక్తిని, ఆమె సోదరిని కూడా అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ అమ్మాయి తరఫున వాదనలు వినిపించేందుకు లాయరు నియమిస్తున్నామని, విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ అల్ షామిసి తెలిపారు. కాగా, ఆమె తీసుకున్న నిర్ణయం తప్పే అయినా.. తండ్రి కోసం ఇంత తీవ్రమైన నిర్ణయానికి వచ్చిన సదరు యువతిని పలువురు అభినందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+