అది చూసి దిమ్మతిరిగింది: థియేటర్‌లో ఆత్మలన్ని గుమిగూడి..(వీడియో)

Subscribe to Oneindia Telugu

లింకన్‌షైర్: నిజంగా దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? అన్న ప్రశ్న నేటికీ మిస్టరీయే. ఇప్పటికైతే ఉన్నాయనడానికి కచ్చితమైన ఆధారాలేవి లేవు. తాజాగా ఆత్మలు ఉన్నాయా? అని అనుమానం రేకెత్తించే ఘటన మరొకటి చోటు చేసుకుంది.

లింకన్‌షైర్‌లోని ఓల్డ్‌ నిక్‌ థియేటర్‌లో కొంతమంది ఘోస్ట్ హంటర్స్ తీసిన వీడియో ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.థియేటర్‌లో హత్యకు గురైన పాతిక మంది కళాకారుల ఆత్మలు అక్కడే ఉన్నాయన్న అనుమానంతో ఘోస్ట్‌ హంటర్ల బృందం అక్కడికి వెళ్లింది.

దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయన్న అనుమానం, భయంతో ఇప్పటికీ ఆ థియేటర్ ను ఓపెన్ చేయడం లేదు. దీంతో థియేటర్ సంగతేంటో తేల్చడానికి ఘోస్ట్ హంటర్స్ పూనుకున్నారు. అర్థరాత్రి పూట తమవెంట ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను తీసుకుని థియేటర్‌లోకి వెళ్లారు.

Terrifying moment script flies across haunted stage in theatre where 25 people died

కళాకారులు హత్యకు గురైన ప్రాంతంలో అనుమానం వచ్చిన ప్రతీ దాన్ని చిత్రీకరించారు. మరుసటి రోజు ఆ వీడియోను పరిశీలించగా.. కళాకారుల ఆత్మలన్ని ఒకచోట గుమిగూడినట్టుగా అందులో కనిపించింది. దీంతో ఘోస్ట్ హంటర్స్ షాక్ తిన్నారు.

ఎక్కడైతే హత్య జరిగిందో.. అదే ప్రదేశంలో ఆత్మలన్ని కలిసి అక్కడే గుమిగూడటం ఆశ్చర్యం కలిగించింది. ఏదో వస్తువు అటువైపుగా ఎగిరెళ్లినట్టు కూడా అందులో కనిపిస్తోంది. ఈ చిత్రాలను టిమ్ మాథ్యూస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ఫోటోలు వైరల్ అయ్యాయి.

అయితే థియేటర్ లో నిజంగా ఆత్మలు ఉన్నాయా? లేదా? అన్న విషయాలను తెలుసుకునేందుకు 'హ్యూమన్ పెండలం' పరీక్ష కూడా చేసినట్టు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The terrifying moment a script flies across a ' haunted ' stage in a theatre where 25 people died has been captured on camera.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి