వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నై‌స్‌లో ఉగ్రదాడి: బాస్టిల్ డే అంటే ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: బాస్టిల్ డే ఉత్సవాలను జరుపుకుంటుండా ట్రక్కు రూపంలో ఉగ్రవాదులు దూసుకొచ్చి ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో బీభత్సం సృష్టించారు. ట్రక్కు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు 84 మందిని బలి తీసుకుంది. నెత్తురు వరదలై పారింది. ఆనందక్షణాలు కాస్తా అనంతమైన విషాదంగా మారిపోయాయి. బాస్టిల్ డే అంటే ఏమిటనేది, దానికున్న ప్రత్యేకతేమిటి అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

ఫ్రాన్స్‌లో రాచరికంపై తిరుగుబాటుకు నాంది పలికిన సందర్భాన్ని బాస్టిల్ డేగా ఫ్రాన్స్ దేశీయులు ప్రతి జులై 14వ తేదీని జరుపుకుంటారు. నిజానికి బాస్టిల్ అనేది ఓ కోట పేరు. ఇది ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించింది. అప్పటి లూయి 16 అనే రాజు తన వ్యతిరేకులను, రాజకీయ ఖైదీలను, అప్పర్ క్లాస్ ఖైదీలను ఈ కోటలో బంధించేవాడు

1789 జులై 14న ఫ్రెంచ్‌ విప్లవంలో భాగంగా వేలాది ఖైదీలు బాస్టిల్‌ ద్వారాలను బద్దలుకొట్టుకుని స్వేచ్ఛావాయువులు పీల్చారు. ఇది ఫ్రాన్స్ స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన ఘట్టం. కాబట్టి జులై 14వ తేదీనిజాతీయ దినోత్సవంగా ఫ్రాన్స్ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. దాన్ని 'బాస్టిల్‌ డేగా పరిగణిస్తున్నారు.

Terror attack: What is Bastille day in France?

ఖైదీలు బాస్టిల్ కారాగారం నుంచి బయటకు రావడమే కాకుండా కోటలో ఉన్న గన్‌పౌడర్‌, ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నారు. నేషనల్‌ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పోరాటంతో స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నారు. తర్వాతి కాలంలో బాస్టిల్‌ను ధ్వంసం చేశారు.

ఫ్రాన్స్ దేశీయులు బాస్టిల్ డేను బాణా సంచా పేల్చి, ఇతరత్రా కార్యక్రమాలతో సంబరాలు చేసుకుంటారు. ఆ సంబరాలను తిలకించడానికే నైస్ నగరంలో ప్రజలు పెద్ద యెత్తున గుమికూడారు. ఈ సమయంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును ఉపయోగించి విధ్వంసానికి పాల్పడ్డారు. చరిత్రలో ఈ విషాద సంఘటన కూడా చీకటి రోజుగా నమోదవుతుంది.

English summary
The Bastille, a medieval fortress and prison, was a symbol of tyrannical Bourbon authority in central Paris and had held many political dissidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X