Tesla : త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ- ఎలాన్ మస్క్ ప్రకటన- మోడీతో ఫలించిన చర్చలు..

భారత్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంతర్జాతీయ బ్రాండ్ టెస్లా ఎంట్రీకి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాదే భారత్ లోకి టెస్లా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని టెస్లా సీఈవో, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఇవాళ ప్రకటించారు. ప్రధాని మోడీతో యూఎస్ లోని న్యూయార్క్ లో భేటీ అయిన మస్క్.. అనంతరం ఈ ప్రకటన చేశారు. దీంతో భారత్ లో టెస్లా కోసం ఎదురుచూపులు ఫలించినట్లయింది.

ప్రధాని మోడీ యూఎస్ లో తన మూడు రోజుల పర్యటన ప్రారంభించారు. ఇవాళ ఉదయం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తో ముందుగా భేటీ అయ్యారు. మోడీతో పలు విషయాలు చర్చించిన మస్క్.. అనంతరం మీడియాతో ఆ విషయాలు పంచుకున్నారు. తాను మోదీ అభిమానినని, ప్రధానితో ఇది అద్భుతమైన సమావేశం ,తనకు ఆయనంటే చాలా ఇష్టం అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మోడీ తమఫ్యాక్టరీని సందర్శించారు. కాబట్టి తాము ఒకరికొకరు కొంతకాలంగా తెలుసన్నారు. భారత్ భవిష్యత్తుపై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని మస్క్ వెల్లడించారు.

 modielonmusktesla-
ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత అవకాశం భారత్ కు ఉందన్నారు. అంతకుముందు 2015లో కాలిఫోర్నియాలోని టెస్లా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంగా ప్రధాని మస్క్‌ను కలిశారు. ఇప్పుడు మరోసారి కలిశారు. రెండేళ్ల క్రితం భారత్ లో టెస్లా ప్రవేశం కోసం మోడీ సర్కార్ తో చర్చించిన మస్క్.. అప్పట్లో ముందుగా భారత్ కు యూఎస్ నుంచి వాహనాలు పంపుతానని, ఆ తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ మాత్రం మేకిన్ ఇండియాలో భాగంగా ఇక్కడే నేరుగా పెట్టి వాహనాలు తయారు చేయాలని కోరింది. అలాగే భారీగా పన్ను రాయితీలు కూడా కావాలని మస్క్ కోరడంతో ఈ ప్రతిపాదన ముందుకెళ్లలేదు.

కానీ ఇప్పుడు ప్రధాని మోడీ మస్క్ తో తన చర్చల సందర్భంగా ఈ ఏడాది చివర్లో భారత్ లో టెస్లా ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ లో టెస్లా ఎంట్రీపై మస్క్ నేరుగా ప్రకటన చేశారు. మస్క్‌తో తన భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, "ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా బాగుంది @elonmusk! శక్తి నుండి ఆధ్యాత్మికత వరకు అనేక విషయాలపై మేము బహుముఖ సంభాషణలు చేసాము. అన్నారు. దీనికి బదులుగా "మళ్ళీ కలుసుకోవడం గౌరవంగా ఉంది." అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+