వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఈఓ ఖాతానే సస్పెండ్ చేసిన ట్విట్టర్: అసలేమైంది?

ట్విట్టర్‌ సీఈవో, సహవ్యవస్థాపకుడు జాక్‌ డార్సే ట్విట్టర్‌ ఖాతానే కొద్ది నిమిషాల పాటు బ్లాక్‌ అయ్యింది.

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచంలోనే పేరుగాంచిన సోషల్ మీడియా దిగ్గజాలు ఈ మధ్య తప్పుటడుగులు వేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఫేస్‌బుక్.. తమ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తోపాటు 2మిలియన్ల యూజర్లను చనిపోయినట్లు ప్రకటించింది. ఇది సాంకేతిక లోపమని తర్వాత వివరణ ఇచ్చుకుంది. ఇప్పుటు మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా అదే బాటలో నడిచింది.

అసలేం జరిగిందంటే.. ట్విట్టర్‌ సీఈవో, సహవ్యవస్థాపకుడు జాక్‌ డార్సే ట్విట్టర్‌ ఖాతానే కొద్ది నిమిషాల పాటు బ్లాక్‌ అయ్యింది. అదేదో సైబర్‌ నేరగాళ్లు లేదా ఇంకెవరో చేసింది కాదు. స్వయానా ట్విట్టర్‌ కంపెనీనే ఆ పని చేసింది. ఇంటర్నల్‌ మిస్టేక్‌ వల్ల తన అకౌంట్‌ బ్లాక్‌ అయినట్లు తర్వాత ఆయనే ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

డార్సేకు మెసేజ్‌లు పంపించాలని ప్రయత్నించిన నెటిజన్లకు ఆయన ట్విట్టర్‌ ఖాతా బ్లాక్‌ అయినట్లు కనిపించింది. కొద్ది సేపటి తర్వాత గమనించిన డార్సే సాంకేతిక లోపం కారణంగా అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందని వివరణ ఇచ్చారు. కాగా, వినియోగదారులు తమ ఖాతాలను డియాక్టివేట్‌ చేసినా ట్విట్టర్‌ వారి అకౌంట్లను సస్పెండ్‌ చేస్తుంది.

The CEO of Twitter Had His Account Suspended on Twitter

సహవ్యవస్థాపకుడైన డార్సే నిరుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగుల కోత, నిరుత్సాహపరిచిన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారిగా పనిచేసిన అదమ్‌ బైన్‌ తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ఈయేడాది నవంబర్ మొదట్లో సంస్థ ప్రకటించారు.

English summary
“Just setting up my twttr…again” The chief executive of Twitter had his account briefly suspended because of what he said was an “internal mistake.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X