భూ పరిభ్రమణంలో అనూహ్య పరిణామాలు: ఎన్నో అనర్థాలు: కీడును శంకిస్తోన్న పరిశోధకులు
లండన్: సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి తీసుకునే సమయంలో 24 గంటలు. క్రమంగా ఇది వేగాన్ని పుంజుకొంటోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. 24 గంటల కంటే ముందే భూ పరిభ్రమణ కాలం పెరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో మళ్లీ, మళ్లీ అలాంటి సందర్భాలు సంభవించడానికి అవకాశాలు లేకపోలేదని, అదే జరిగితే- సైన్స్‌కు కొత్త నిర్వచనాన్ని ఇచ్చుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.
ఈ ఏడాది జూన్ 29వ తేదీన భూమి 24 గంటలు పూర్తికావడానికి ముందే తన పరిభ్రమణ కాలాన్ని పూర్తి చేసుకుందని నాసా గుర్తించింది. 24 గంటల లోపే అంటే 1.59 మిల్లీ సెకెండ్లు తక్కువ కాలంలో భూ భ్రమణం ముగిసింది. ఇదివరకు కూడా ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. 2020 జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకెండ్లు మిగిలివుండగానే తన పరిభ్రమణ కాలాన్ని ముగించింది. ఇప్పుడు మళ్లీ దాన్ని అధిగమించింది.

భూమి తన చుట్టూ తాను తిరిగే వేగాన్ని పెంచుకోవడానికి కారణాలను అన్వేషిస్తోన్నారు నాసా పరిశోధకులు. భూ లోపలి పొరల్లో మార్పులు, ఫలకాల్లో కదలికలు, మహాసముద్రాల ఆటుపోట్లు, వాతావరణంలో మార్పులు కారణంగా ఇది సంభవించినట్లు అంచనా వేస్తోన్నారు. పెను భూకంపాలు భూ కదలికలను నిర్దేశిస్తోన్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి మున్ముందు మరిన్ని సంభవించడానికి అవకాశాలు లేకపోలేదని, అవి భౌగోళిక, వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు.
ఇలాంటి పరిణామాలు నెగిటివ్ లీప్ సెకండ్లకు దారి తీస్తుందని నాసా పరిశోధనకులు స్పష్టం చేశారు. ఇది టైమ్ జోన్ల మీద ప్రభావం చూపుతుందని, వాటిని సవరించుకోవాల్సిన అవసరం రావొచ్చని చెప్పారు. కంప్యూటర్ ప్రొగ్రామ్స్ అన్నీ 00:00:00 మీదే ఆధారపడి ఉన్నాయని, ఇప్పుడు ఈ భూ పరిభ్రమణ కాలంలో మార్పులు చోటు చేసుకుంటే సాంకేతికపరంగా అనర్థాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 60 సెకెండ్లు పూర్తి కాకముందే వాటి ప్రోగ్రామింగ్ మారిపోతుందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications