వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిస్ట్ మసూద్ అజహర్ చాలా పిరికివాడట, ఒక్క దెబ్బకే వణికి అన్నీ చెప్పేస్తాడు!

|
Google Oneindia TeluguNews

కరాచీ: జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ గురించి అతనిని గతంలో విచారించిన ఓ అధికారి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అజహర్ కరడుగట్టిన తీవ్రవాది. టెర్రర్ దాడులకు ప్లాన్ చేస్తాడు.

కానీ విచారణలో మాత్రం అతను ఒక దెబ్బ కొడితే భయపడిపోతాడట. అంటే చాలా పిరికివాడని చెబుతున్నారు. 1994లో మసూద్‌ను కస్టడీలోకి తీసుకున్న సమయంలో అతడిని విచారించిన పోలీస్ అధికారి అవినాష్ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

ఒక్క దెబ్బ కొట్టగానే భయంతో వణికిన అజహర్

ఒక్క దెబ్బ కొట్టగానే భయంతో వణికిన అజహర్

1994లో అజహర్ పోర్చుగీస్ పాస్‌పోర్టుతో బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా వచ్చాడు. అప్పుడు అనంత్‌నాగ్ జిల్లాలో అతనిని అరెస్ట్ చేశారు. అతనిని విచారించేందుకు పోలీసులు పెద్దగా ఇబ్బంది పడలేదని సదరు అదికారి తెలిపారు. అధికారి ఒక్క దెబ్బ కొట్టగానే భయంతో వణికిపోయాడట. పాకిస్తాన నుంచి తాను చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి మొత్తం గుట్టు విప్పాడట.

ఇస్లామీ తీవ్రవాద సంస్థలతో చర్చలు

ఇస్లామీ తీవ్రవాద సంస్థలతో చర్చలు

మసూద్ అజహర్ గురించి చెప్పిన అధికారి నాడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేశారు. కాశ్మీర్ డెస్క్ హెడ్‌గా ఉన్నారు. అప్పుడు అజహర్‌ను విచారించారు. విచారణలో అజహర్ పలు విషయాలు చెప్పాడు. ఉగ్రవాదులను ఎలా నియమిస్తారు, దాడులు ఎలా ప్లాన్ వేస్తారనే విషయాన్ని తెలిపారు. నాడు అజహర్ భారత్ వచ్చాక యూపీలోని సహరంపూర్‌కు వెళ్లాడు. అక్కడ ఇస్లామీ తీవ్రవాద సంస్థలతో చర్చలు జరిపాడు. ఆ తర్వాత కాశ్మీర్ చేరుకున్నాడు. ఈ విషయాన్నింటిని విచారణలో చెప్పాడని సదరు అధికారి తెలిపారు.

అలా విడిచిపెట్టారు

అలా విడిచిపెట్టారు

తనను ఎక్కువ కాలం మీ కస్టడీలో ఉంచుకోలేరని, పాకిస్తాన్‌కుప చెందిన ఐఎస్ఐ తనను తీసుకు వెళ్తుందని కూడా అజహర్ చెప్పాడట. ఆ తర్వాత పది నెలలకే.. విదేశీయుల్ని కిడ్నాప్ చేశామని, అజహర్‌ను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారని, కానీ వారి కల నెరవేరలేదన్నారు. ఎన్నో ప్రయత్నాల అనంతరం 1999లో కాట్మాండ్ నుంచి వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని కాందహార్‌లో హైజాక్ చేశారని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం అతనిని విడిచి పెట్టిందన్నారు.

English summary
A former Intelligence Bureau guy revisits his long interrogatory sessions with Pulwama mastermind Azhar at Kot Bhalwal Jail in Jammu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X