సరికొత్త జిమ్.. కునుకు తీస్తే చాలు.. కెలోరీలు కరిగిపోతాయి

శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టకుండా కెలొరీలు తగ్గించే జిమ్‌లను లండన్‌లో ఏర్పాటు చేశారు. అక్కడికెళ్లి చేయాల్సిందల్లా పడుకోవడమే! అవును.. మీరు చదివింది నిజమే..

లండన్: సాధారణంగా పడుకోవడం వల్ల కూడా శరీరంలోని కెలొరీలు కరిగిపోతాయి. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది లండన్ కు చెందిన డేవిడ్‌ లాయడ్‌ జిమ్స్‌ సంస్థ. అంతేకాదు, దీనిని కమర్షియల్‌ సర్వీస్‌గా కూడా మార్చేసింది.

మామూలుగా అయితే ఆహారం ద్వారా మన శరీరంలో చేరిన కెలొరీలు తగ్గించుకోవాలంటే .. జాగింగ్‌.. రన్నింగ్‌.. జిమ్‌కెళ్లి వ్యాయామంలాంటివి చేయాలి. కానీ.. చాలా మందికి బద్ధకం. ఇవేమీ చేయరు.

ఇలాంటి వారి కోసం ఇప్పుడు శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టకుండా కెలొరీలు తగ్గించే జిమ్‌లను లండన్‌లో ఏర్పాటు చేశారు. అక్కడికెళ్లి చేయాల్సిందల్లా పడుకోవడమే! అవును.. మీరు చదివింది నిజమే..

The new exercise class where you SLEEP for 45 minutes and STILL burn calories

డేవిడ్‌ లాయడ్‌ జిమ్స్‌ సంస్థ లండన్‌ వ్యాప్తంగా ఉన్న తమ జిమ్‌ శాఖలలో 'నాపర్‌సైస్‌' పేరుతో వ్యాయామ తరగతులు ప్రారంభించింది. ఇందులో చేరిన వాళ్లు ఏమీ చేయాల్సిన పనిలేదు. జిమ్‌లో ఉన్న మంచంపై 45నిమిషాలపాటు ప్రశాంతంగా పడుకుంటే చాలు. శరీరంలో కెలొరీలు అవే కరిగిపోతాయి.

అయితే ఈ తరగతులు కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే నిర్వహిస్తారు. శరీరంలోని కెలొరీలు కరిగిపోయేందుకు అవసరమైన ఉష్ణోగ్రత గదిలో ఉండేలా చూస్తారు. అలాగే మెదడుకు మరింత శక్తినివ్వడానికి.. ఉత్తేజాన్ని పెంచడానికే ఈ 'నాపర్‌సైస్‌' తరగతులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+