వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఆర్మీ చీఫ్ ఎవరు ? రేసులో వీరే

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవికాలం నవంబర్ చివరికి ముగుస్తుంది. తరువాత పాక్ ఆర్మీ చీఫ్ గా ఆయన పదవికాలాన్ని పొడగిస్తారా ? లేదా ఆయన రాజీనామా చేస్తారా ? అని కచ్చితంగా తెలియడం లేదు. పాక్ ఆర్మీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారు అని భారత్ కూడా ఆసక్తిగా గమనిస్తుంది.

తనకు ఆర్మీ చీఫ్ గా కొనసాగటానికి ఇష్టం లేదని, నవంబర్ లో పదవి విరమణ చేస్తానని 2016 జనవరిలో రహీల్ షరీఫ్ పాక్ మీడియాకు చెప్పారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. పీవోకేలో భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత అది ముదిరిపాకనపడింది.

అందువలన రహీల్ షరీఫ్ పదవి కాలం పోడగించకపోవచ్చని పాక్ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో రహీల్ షరీఫ్ ను ఆర్మీ చీఫ్ గా కొనసాగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

రహీల్ షరీఫ్ ను ఆర్మీ చీఫ్ గా కొనసాగించడానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆసక్తి చూపించడం లేదని పాక్ మీడియా అంటున్నది. రహీల్ షరీఫ్ పదవి కాలం పూర్తి అయితే ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించడానికి నలుగురు సీనియర్ ఆర్మీ అధికారులు క్యూలో ఉన్నారు.

జావెద్ ఇక్బాల్

జావెద్ ఇక్బాల్

లెఫ్టినెంట్ జనరల్ జావెద్ ఇక్బాల్ కు అధికార పార్టీ అండ ఉంది. ఆర్మీలో ఈయన సీనియర్ అధికారి. బహర్వాల్ పూర్ బేస్ డ్ XXXI కమాండర్ గా ఉన్నారు. 2009లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి స్వాట్ వ్యాలీలో తెహీర్-ఇ-తాలిబన్ ఉగ్రవాదులను అంతం చేశారు.

జుబైర్ హయాత్

జుబైర్ హయాత్

లెఫ్టినెంట్ జనరల్ జుబైర్ హయత్ కూడా ఆర్మీ చీఫ్ పదవి రేసులో ఉన్నారు. ఈయన న్యూక్లియర్ ఆయుధాలు విజయవంతంగా తయారు చేయించి పాక్ ఆర్మీలో పేరు తెచ్చుకున్నారు. లాహోర్ లో ఉంటున్న జనరల్ జుబైర్ హయత్ వ్యూహాలు రచించడంలో దిట్ట అనే పేరు ఉంది. ప్రస్తుతం ఈయన ఆర్మీలో ఇంటిజెన్స్, ఆపరేష్ విభాగాలను చూసుకుంటున్నారు.

ఇష్వాక్ నదీమ్ అహమ్మద్

ఇష్వాక్ నదీమ్ అహమ్మద్

లెఫ్టినెంట్ జనరల్ ఇష్వాక్ నదీమ్ అహమ్మద్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కు నమ్మకస్థుడు. గిరిజనులు ఎక్కుగా నివాసం ఉండే ప్రాంతాల్లో జర్బ్-ఇ-అజబ్ తాలిబన్ ఉగ్రవాదులు మకాం వేశారు. తాలిబన్ ఉగ్రవాదులను ఎరిపారేసి ఆర్మీలో పేరు తెచ్చుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ పదవి రేసులో ఇష్వాక్ నదీమ్ అహమ్మద్ పేరు ఉంది.

క్వూమర్ జావెద్ బాజ్వా

క్వూమర్ జావెద్ బాజ్వా

పాక్ ఆర్మీ ట్రైనింగ్ వింగ్ హెడ్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ క్వూమర్ జావెద్ బాజ్వా పేరు కూడా పాక్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎల్ వోసీలో సుధీర్ఘంగా సేవలు అంధించిన రికార్డు ఉంది. ఆర్మీ చీఫ్ గా జావెద్ బాజ్వాను ప్రభుత్వం నియమించినా ఆశ్చర్యం లేదు.

నవాజ్ షరీఫ్ దే తుదినిర్ణయం

నవాజ్ షరీఫ్ దే తుదినిర్ణయం

ఈ నలుగురిలో ఎవరో ఒకరు పాక్ ఆర్మీ చీఫ్ గా నియమితులవుతారని పాక్ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వారిని ఆర్మీ చీఫ్ గా నియమించాలని, గతంలో జరిగినట్లు జరిగితే మళ్లీ పదవి ఊడిపోతుందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భయపడుతున్నారు.

English summary
General Sharif is due to retire in November. All eyes would be on Pakistan to see if he is given an extension or stages a coup considering his strained relations with Prime Minister, Nawaz Sharif.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X