జపాన్ లో సెంచరీ చేసిన వృద్దులు 60 వేలు

టోక్యో: జపాన్ దేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దుల సంఖ్య అక్షరాల 60 వేలు దాటింది. ఈ సందర్బంగా జపాన్ లో పెద్ద పండుగ చెయ్యడానికి జపాన్ దేశస్తులు సిద్దం అవుతున్నారు. అందరిని సన్మానించి, ప్రశంసాపత్రాలు, బహుమానాలు ఇవ్వాలని నిర్ణయించారు.

జపాన్ దేశంలో 2015లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దుల సంఖ్య ఎంత అని ప్రభుత్వం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అధికారుల దిమ్మతిరిగే వివరాలు బయటకు వచ్చాయి. జపాన్ దేశంలో 60 వేల మందికి పైగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దులు ఉన్నారని గుర్తించారు.

The number of people aged 100 and above has hit 60,000 in Japan

వీరి కోసం సెప్టెంబర్ 15వ తేదిన ‘సెంచరీ మార్కర్స్ సీనియర్స్ డే 'గా జపాన్ ప్రకటించింది. ఆ రోజు 7,000 యన్ (జపాన్ కరెన్సీ)ల విలువైన వెండి గిన్నెలను 30,379 మంది వృద్దులకు బహుమానంగా అందిస్తున్నారు. 1963 లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న 153 మంది వృద్దులకు వెండి గిన్నెలు బహుమతిగా ఇచ్చారు.

అప్పటి నుంచి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దులకు వెండి గిన్నెలు బహుమానంగా అందిస్తున్నారు. 2014లో 30,000 మంది వృద్దులకు వెండి గిన్నెలు బహుమతిగా అందించారు. ఇప్పుడు ఆ సంఖ్య 30,379కి చేరింది. ఈ 60వేల మందిలో 87 శాతం మంది బామ్మలే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+