జపాన్ హైటెక్ బురద బార్ సూపర్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

టోక్యో: బురదలో కుర్చుని మీకు ఇష్టమైన మద్యం సేవించండి అంటున్నారు. జపాన్ లో ఇలాంటి బురద బార్ ప్రారంభించారు. యువతి, యువకులు ఈ బురద బార్ లో మద్యం సేవించడానికి ఎగబడుతున్నారు.

జపాన్ లోని టోక్యోలో కొత్తగా గాటా బార్ ప్రారంభం అయ్యింది. ఈ బార్ ను చాల విచిత్రంగా ఏర్పాటు చేశారు. విశాలమైన ఓ పెద్ద టబ్ పెట్టి అందులో బురద నింపేశారు. ఈ బురదలో కుర్చుని మద్యం సేవించండి అని ప్రకటనలు ఇస్తున్నారు.

The pop-up is actually part of a scheme to advertise Saga

మీకు ఇష్టమైన మద్యం సేవిస్తూ బురదలో సేదతీరవచ్చని చెబుతున్నారు. సముద్రంలో ఖనిజ లవణాలు కలిగిన 8 టన్నుల బురదను తీసుకువచ్చి ఈ పెద్ద టుబ్ లో వేశామని బార్ నిర్వహకులు చెబుతున్నారు.

The pop-up is actually part of a scheme to advertise Saga

మా బార్ లో మద్యం కొన్న వారికి ఒక గంట పాటు ఈ టబ్ లో సేద తీరడానికి అవకాశం కల్పిస్తున్నామని అంటున్నారు. బురదలో మద్యం సేవించిన వారు తరువాత స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. టోక్యోలోని మడ్ బార్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నది. మందు బాబులు ఆ బార్ లో మద్యం సేవించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A prefecture in the south of Japan on the island of Kyushu that is famous for its mud bathing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి