వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Condoms: యువతకు కండోమ్‌లు ఫ్రీ..

|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని యువతకు ఫ్రీగా కండోమ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి దేశంలోని ఫార్మసీల ద్వారా ఉచిత కండోమ్‌లను యువతకు ఇస్తున్నట్లు ప్రకటిచింది. ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. యువతలో అవాంఛిత గర్భాలను తగ్గించే ప్రయత్నంలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఫార్మసీలలో ఉచితంగా కండోమ్‌లను అందుబాటులో ఉంచుతామని ఫ్రెంచ్ అధ్యక్షుడు చెప్పారు.

ఇమ్మాన్యుయెల్ మాక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఫార్మసీల ద్వారా జనవరి 1 నుంచి 18-25ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత ఉచిత కండోమ్‌లను పొందవచ్చు' అని ప్రకటించారు. లైంగిక సంబంధ వ్యాధులను, జనాభా నియంత్రణను దృష్టిలో పెట్టుకునే ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగిక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య 30శాతం పెరిగిందని స్థానిక మీడియో తెలిపింది."ఇది గర్భనిరోధకం కోసం ఒక చిన్న విప్లవం," ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పశ్చిమ ఫ్రాన్స్‌లోని పోయిటియర్స్ శివారు ప్రాంతమైన ఫాంటైన్-లె-కామ్టేలో యువకులతో ఆరోగ్య చర్చ సందర్భంగా ఈ నిర్ణయం ప్రకటించారు.

 The President of France has decided to provide free condoms to those between the ages of 18 and 25
మాస్క్
"మేము ఈ విషయంపై అంత బాగా లేము. వాస్తవికత సిద్ధాంతానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది మన ఉపాధ్యాయులకు మరింత మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని మాక్రాన్ అన్నారు. కాన్ఫరెన్స్‌లో మాక్రాన్ ఫేస్ మాస్క్ ధరించాడు, తాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తున్నానని, క్రిస్మస్ సందర్భంగా కోవిడ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, శీతాకాలం సమీపిస్తున్నందున కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్‌లను తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
English summary
The French government has taken a sensational decision. It decided to give free condoms to the youth of that country. It has announced that from January 1, free condoms will be given to the youth through pharmacies across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X