వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో టాప్ హీరోలు, విలన్లు వీరే, బుష్ పెద్ద విలన్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచంలో మంచివారు ఎవరు, క్రూరులు ఎవరు అని ఒక సర్వే నిర్వహించారు. పరిశోదనలలో జీవన విదానాన్ని మార్చినవారు, శాంతి, సహనం గురించి బోధించినవారు, అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్న వారు ఎవరు అని సర్వే చేశారు. అందులో ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూశాయి.

ప్రపంచంలో టాప్ టెన్ హీరోలు, టాప్ టెన్ విలన్లు ఎవరు అని వివరాలు సేకరించారు. అమెరికా, ఇటలీ, దక్షిణ కొరియా, అర్జెంటినా, పాకిస్థాన్ తో సహ 37 దేశాల లోని వివిద యూనివర్శిటీల్లో 7 వేల మంది విద్యార్థుల అభిప్రాయాలు సేకరించారు. ఆ విద్యార్థులు ఎవరిని ఆరాదిస్తున్నారు, ఎవరిని అసహ్యించుకుంటున్నారు అని వారి మనస్సులో నుండి వివరాలు రాబట్టారు.

 The top ten Heroes and Villains of World History

సర్వే ప్రకారం ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ హీరోల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ హీరోల జాబితాలోనే మదర్ థెరిస్సా, జాతిపిత మహాత్మగాంధీల పేర్లు ఉన్నాయి. విలన్ల విషయానికి వస్తే దిమ్మతిరిగే విషయం బయటపడింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ పేరు విలన్ల జాబీతాలో ఉంది.

అప్ఘనిస్థాన్, ఇరాక్ దేశాలతో యుద్దం చేసి లక్షల మంది అమాయకులైన సామాన్య పౌరుల ప్రాణాలు తీశాడని జార్జ్ బుష్ విద్యార్థుల పాలిట విలన్ అయ్యాడు. అలాగే రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్, లెనిన్, జర్మనీ మాజీ నియంత అడాల్ఫ హిట్లర్ విలన్ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

ప్రపంచంలోని వివిధ యూనివర్శిటిలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల మనస్సులో స్థానం సంపాదించిన వారు, విద్యార్థులు అసహ్యించుకునే వ్యక్తుల జాబితా ఈ విధగా ఉంది.

 The top ten Heroes and Villains of World History

హీరోలు: 1. అల్బర్ట్ ఐన్ స్టీన్, 2. మదర్ థెరిస్సా 3. జాతిపిత మహాత్మా గాంధీ 4. మార్టీన్ లూథర్ కింగ్ 5. ఐజక్ న్యాటన్ 6.జీసస్ క్రైస్ట్, 7, నెల్సన్ మండేలా 8. థామస్ ఎడిసన్ 9, అబ్రహాం లింకన్, 10. గౌతమ బుద్దుడు.

విలన్లు వీరే: 1. అడల్ఫా హిట్లర్, 2 బసామా బిన్ లాడెన్, 3. సద్దాం హుస్సేన్,4. జార్జిబుష్, 5, స్టాలిన్, 6. లెనిన్, 7. మావో, 8. ఈజిప్ట్ మాజీ సుల్తాన్ సలాద్దీన్, 9. ఉమ్మడి చైనా పాలకుడు కిన్ షి హువాంగ్, 10. చెంఘీజ్ ఖాన్.

English summary
This is according to the opinions of almost 7,000 students from 37 countries including Argentina, Pakistan, South Korea, Italy, and the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X