వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వం నెమ్మదిగా అంతరిస్తోంది, కానీ అప్పుడే కాదు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: మన విశ్వం నెమ్మదిగా అంతరిస్తోందని తాజా అధ్యయనం పేర్కొంది. కాకపోతే ఇంకా 100 బిలియన్ సంవత్సరాలు మిగిలి ఉన్నాయని పేర్కొంది.

ఆస్ట్రేలియాలోని ఖగోళ శాస్త్ర పరిశోధన అంతర్జాతీయ కేంద్రం (ఐసీఆర్ఏఆర్) పరిశోధకులు ప్రపంచంలోని శక్తిమంతమైన ఏడు టెలిస్కోపుల్ని ఉపయోగించి 21 విభిన్న తరంగదైర్ఘ్యాల్లో నక్షత్ర మండలాలను పరిశీలించారు.

మన సృష్టి అంతరించి పోయేందుకు మరో 100 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుందని గుర్తించారు. 2 లక్షలకు పైగా పాలపుంత (నక్షత్ర మండలాలు)లపై జరిపిన అధ్యయనం ప్రకారం ఈ పాలపుంతల నుంచి విడుదలయ్యే శక్తి 200 కోట్ల సంవత్సరాలకు ముందు ఉత్పత్తయ్యే శక్తిలో సగమే ఉందని గుర్తించారు.

 'The Universe is slowly dying,' study shows with unprecedented precision

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉన్న ఆంగ్లో - ఆస్టేలియన్ టెలీస్కోప్‌ను ఉపయోగించి మొదట ఈ పరిశోధనను నిర్వహించారు. ఆ తర్వాత, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ఆపరేట్ చేస్తున్న గ్రహాల చుట్టూ పరిభ్రమించే మరో రెండు టెలీస్కోప్‌లు కూడా ఇదే రకమైన విషయాలను కనుగొన్నాయి.

ఇంతకుముందు ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్న మల్టీ వేవ్‌లెంగ్త్ అధ్యయనం గెలాక్సీ అండ్ మాస్ అసెంబ్లీ (గామా) ప్రాజెక్టులో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు. రెండు లక్షలకు పైగా గెలాక్సీల నుంచి విడుదలయ్యే శక్తిని కొలిచేందుకు తాము తమకు అందుబాటులో ఉన్న టెలిస్కోప్‌లన్నిటినీ ఉపయోగించినట్లు ఐసిఆర్‌ఏఆర్‌కు చెందిన ప్రొఫెసర్ సైమన్ డ్రైవర్ చెప్పారు.

ఈ సర్వేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్తజ్ఞ్రులకు పంపించారు. అయితే ఇదంతా కూడా అత్యంత సుదీర్ఘమైన, నిదానంగా జరుగుతున్న ప్రక్రియ అని అన్ని నక్షత్ర మండలాలనుంచి విడుదలవుతున్న కాంతులన్నీ కూడా ఆగిపోవడానికి మరో వంద బిలియన్ సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే సమయం పడుతుందని గామా టీమ్‌కు చెందిన డ్రైవర్ చెప్పారు.

విశ్వంలోని నిర్ణీత పరిధిలోపల ఉత్పన్నమయ్యే శక్తిని కొలిచి మ్యాపింగ్ చేయడానికి ఈ అధ్యయనాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. విశ్వం అంతరిస్తోందనే అంశం 1990ల నాటి నుంచే వెల్లడైన విషయమనీ, దీనిపై తాము చేపట్టిన పరిశోధన మరింత సమగ్రమైందన్నారు.

English summary
The conclusion of a new astronomical study pulls no punches on this. "The Universe is slowly dying," it reads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X