వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా: భారత్‌తో సరైన సరిహద్దులు లేవట, నీతులు చెబుతూనే...

|
Google Oneindia TeluguNews

బీజింగ్: సామ్రాజ్యవాదంతో పొరుగుదేశాలను కబలిస్తున్న డ్రాగన్ దేశం మరోసారి తన దుర్భుద్ధిని మరోసారి చాటుకుంది. భారత్-చైనా సరిహద్దుల్ని ఖచ్చితంగా నిర్ణయించలేదని, ఈ కారణంగానే ఇరుదేశాల మధ్య ఎప్పటికీ వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటూ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లుగా విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Recommended Video

#IndiaChinaStandoff: Indian Army దే తప్పు, వెనక్కెళ్లాలని China డిమాండ్
భారత్-చైనాలపై ప్రపంచ దృష్టి..

భారత్-చైనాలపై ప్రపంచ దృష్టి..

యూరప్ పర్యటనలో ఉన్న వాంగ్ యీ ప్యారిస్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. భారతదేశంతో సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. భారత్-చైనా సంబంధాలపై ఇటీవల ప్రపంచ దేశాల దృష్టి మళ్లిందన్నారు. ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఓ వైపు నీతులు చెబుతూనే..

ఓ వైపు నీతులు చెబుతూనే..

భారత్, చైనాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో సరిహద్దు వివాదాలను కూడా చేర్చాలని అవసరం ఉందని వాంగ్ యీ చెప్పుకొచ్చారు. రెండు దేశాలు అభివృద్ధి సాధిస్తే ప్రపంచంలో 270 కోట్ల మంది ఆధునికత వైపు అడుగులు వేసినట్లేనని తెలిపారు. ప్రపంచ సామాజిక పరిస్థితిపై ఇంది ఎంతో ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చారు. ఓ వైపు గోతులు తవ్వుతూనే మరో వైపు నీతులు చెప్పడం చైనాకే సాధ్యమయ్యేపనిలా డ్రాగన్ పెద్దల మాటలు చూస్తే అర్థమవుతుంది.

ఓ వైపు ఘర్షణలకు దిగుతూనే.. మరో వైపు శాంతి చర్చలట

ఓ వైపు ఘర్షణలకు దిగుతూనే.. మరో వైపు శాంతి చర్చలట

ఓ వైపు సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతూనే మరోవైపు శాంతి చర్చలంటూ చైనా తన జిత్తులమారి తెలివిని ప్రదర్శిస్తోంది. లఢక్‌లోని పాంగ్యాంగ్ సరస్సు వద్ద సైనిక బలగాలను పెంచుతూ భారత్‌తో ఘర్షణకు దిగిన రెండో రోజే వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తే చైనా తన కుటిల బుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నట్లయింది. చైనా బలగాలు మన సరిహద్దులోకి ప్రయత్నించిగా అడ్డుకున్న భారత జవాన్లు.. ఇప్పుడు సౌత్ ప్యాంగ్యాంగ్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం చైనాకు మింగుడుపడని అంశంగా మారింది.

English summary
Chinese foreign minister Wang Yi on Tuesday said that there have been problems between India and China in eastern Ladakh along the Line of Actual (LAC) as the boundary between the two countries has not yet been demarcated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X