కన్నబిడ్డలని కూడా చూడకుండా.. స్వర్గానికి వెళ్తారని హత్య
అమెరికా : అభివృద్దిలో జెట్ స్పీడ్ లో దూసుకుపోయే అమెరికాలోను మూఢ నమ్మకాలున్నాయంటే నమ్ముతారా! ఇదంతా చదివాక.. నమ్మక తప్పదు. మతపరమైన విశ్వాసాలను అమితంగా నమ్మే ఓ పాస్టర్ మూఢనమ్మకానికి తన ఇద్దరు పిల్లలు బలైపోయారు. పైగా ఆ హత్యలకు 'స్వర్గం' అన్న పేరు పెట్టడం మనుషుల్లో మతాల పట్ల ఉన్న గుడ్డి విశ్వాసాలను తేట తెల్లం చేస్తోంది.
అమెరికాలోని ఇండియానాకు చెందిన అంబెర్ పాస్టర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో దీనికి సంబంధించి ఆమె జైలు శిక్ష కూడా అనుభవించింది. కాగా, ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన వివరాలు విని చాలామంది షాక్ తిన్నారు.

ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. 'ఆ రోజు చాలా మంచి రోజు. ఆ రోజు చనిపోయినవారు ఖచ్చితంగా స్వర్గానికి వెళతారని నాకు తెలిసింది. నా పిల్లలను కూడా స్వర్గానికి పంపాలని అనుకున్నాను. అందుకోసం నేను వారిని బలవంతం చేయలేదు. వారికి రెండు అవకాశాలు ఇచ్చాను. బతికి ఉండాలనుకుంటే రోజూ నాలాగే కష్టాలు పడాల్సి ఉంటుంది. చనిపోడానికి సిద్ధపడితే మాత్రం స్వర్గానికి చేరుకుంటారు. మీరే ఆలోచించుకోండి అని నా కొడుక్కి, కూతురికి చెప్పాను. చనిపోయి స్వర్గానికి చేరుకోవడానికి నా కూతురు(6 సంవత్సరాలు) ఒప్పుకుంది'.
'అందుకే నా కూతురిని చంపేశాను, కూతురిని చంపేసిన అనంతరం నాకొడుకు కూడా స్వర్గానికే వెళ్తానని కోరడంతో.. వాడిని కూడా చంపేశాను' అంటూ చెప్పుకొచ్చింది. ఈ వివరాలు వెల్లడిస్తున్నప్పుడు.. ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం గానీ, తప్పు చేశానన్న భావన గానీ లేకపోవడం గమనార్హం.
ఇంటర్వ్యూలో తన బిడ్డలను తలుచుకంటూ.. 'ఇప్పుడు వారు ఆనందంగా, సంతోషంగా ఉన్నారని చెప్పలేను. కానీ, ఇంతకంటే మంచి ప్లేస్‌లో ఉన్నారని చెప్పగలనని' తెలిపింది. కాగా, పిల్లలను హత్య చేశాక తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆమెను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీంతో కొన్నిరోజుల పాటు జైలు జీవితం గడిపి ఇటీవలే విడుదలైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications