బాత్‌రూమ్‌లో ఉండగా అగ్ని ప్రమాదం: చైనా జంట సెల్పీల పిచ్చి

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: ఇల్లు తగులబడితే చాలా బాధపడతాం, ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయని ఆందోలన చెందుతాం.కానీ, దానికి భిన్నంగా ఓ చైనా జంట తమ కాలిపోయిన ఇంట్లోనే సెల్పీలు దిగి ఎంజాయ్ చేశారు. ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్దం కాకుండా స్థానికులు వారికి సహకరించారు. అయితే కాలిన ఇంట్లో వారు సెల్పీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఇంట్లో వస్తువులు కాలిపోయి సర్వస్వం కోల్పోయిన వారు చాలా దిగులు చెందుతారు అయితే సెల్పీల పిచ్చి ఇటీవల కాలంలో ముదిరిపోయింది. సెల్పీల పిచ్చి కూడ ఒక రకమైన రోగమేనని ఇటీవల కాలంలో పరిశోధకులు తేల్చి చెప్పారు.

స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకోవడం కంటే సెల్పీలు తీసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సెల్పీ పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఇదే తరహ ఘటన ఒకటి చైనాలో చోటు చేసుకొంది.

 చైనా జంట సెల్పీ పిచ్చి

చైనా జంట సెల్పీ పిచ్చి

ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వస్తువులు కాలిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటామని , ఆ తర్వాత ప్రమాద తీవ్రత ఎక్కువైతే ఇంటి నుండి తప్పించుకొంటాం. చైనాలో మాత్రం ఇదే తరహ ఘటన ఒకటి చోటు చేసుకొంది అగ్ని ప్రమాదం సంభవించిన ఇంట్లో ఓ జంట సెల్పీ తీసుకొన్నారు. అగ్ని ప్రమాద సమయంలో మంటలను ఆర్పుతూ కూడ ఫోటోలకు ఫోజులిచ్చారు.

 బాత్‌రూమ్ లో ఉండగా అగ్ని ప్రమాదం

బాత్‌రూమ్ లో ఉండగా అగ్ని ప్రమాదం

చైనాలోని జాంగ్‌ చెంగ్‌ అనే వ్యక్తి బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలోనే ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే కాలుతున్న వాసన వచ్చిన చెంగ్ బాత్ రూమ్ నుండి బయటకు వచ్చే సరికి మంటలు వ్యాపించడాన్ని గమనించాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను లేపాడు. మంటలను ఆర్పారు. స్థానికులు కూడ వచ్చి మంటలను ఆర్పేందుకు వారికి సహకరించారు. మంటలను ఆర్పే సమయంలో సెల్పీలు దిగుతూ వారు ఫోటోలకు ఫోజులిచ్చారు.

పుట్టిన రోజు వేడుకలు

పుట్టిన రోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకల జరుపుకొన్న కొద్ది గంటల్లోనే అగ్ని ప్రమాదం ఆ జంటను విషాదం నింపింది. అయితే ఇవేవీ ఆ జంట పట్టించుకోలేదు. అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లోనే సెల్పీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కుంగిపోలేదు

కుంగిపోలేదు

అగ్నిప్రమాదం సర్వస్వం కోల్పోయామని కుంగిపోకుండా ఉండేందుకు గాను సెల్పీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని భాదితులు చెప్పారు. ఇది తమ సానుకూల స్వభావానికి నిదర్శనమని ఆ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Chinese couple has become the country's latest online celebrity after taking humorous selfies inside their burnt house.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X