వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది న్యూస్ రీల్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. అమెరికన్లకు అదిరిపోయే వార్త చెప్పిన పెద్దాయన..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్ : అమెరికా వణికిపోతోంది.. అమెరికన్లు గజగజలాడిపోతున్నారు. ఇపుడున్న కరోనా ఉధృతికే భయబ్రాంతులకు గురవుతున్నారు. అలాంటిది ఇదేముంది.. ఇంకా ముందుంది ముసళ్ల పండగ అని ఎవరైనా అంటే అది విని తట్టుగోలదా అమెరికా..? సరిగ్గా అగ్రదేశాన్ని ఇలాంటి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు ఓ ప్రముఖ వ్యక్తి. అమెరికన్ వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం డైరెక్టర్ రెడ్ ఫీల్డ్ అమెరికాకు అత్యంత భయంకర వార్తను వినిపిస్తున్నారు.

కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో రెండు నెలల్లో 45 వేల మంది చనిపోయారు. 8 లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. దీనికి మించి భయంకరం అంటే ఎన్ని లక్షల ప్రాణాలు పోతాయో అని అమెరికన్లు రెడ్ ఫీల్డ్ మాటతో వణికిపోతున్నారు. అమెరికాలో చలికాలం డిసెంబరు 20 నుంచి మొదలవుతుంది. అంటే ఇంకా చాలా సమయం ఉంది.

This is only a newsreel..main story ahead..a gentleman threatening US..

రెడ్ ఫీల్డ్ మాటలను బట్టి చూస్తుంటే అప్పటివరకు కూడా అమెరికాలో కరోనా పేషెంట్ల సంఖ్య ఎంత పెరగాలి ? వాస్తవానికి ఇంకో నెలలో అంతా అదుపులోకి వస్తుందనుకుంటున్న తరుణంలో రెడ్ ఫీల్డ్ మాటలు అమెరికన్లకు ఊపిరి ఆగిపోయేలా చేశాయి. వుహాన్ లో వైరస్ పుట్టకముందే ఇలాంటిది ఒకటి వస్తుందని జ్యోతిష అంచనాల ద్వారా చెప్పిన ప్రఖ్యాత బాల జ్యోతిషుడు వచ్చే మార్చి వరకు ఈ భయానక పరిస్థితి తప్పదు అని చెప్పుకొస్తున్నాడు.

అమెరికాలో చలికాలం మార్చిలో ముగుస్తుంది. భారత్ లో కూడా నవంబరులో మొదలై జనవరిలో ముగుస్తుంది. చలికాలం వస్తే ఇదే కరోనా మహమ్మరి తిరగబెట్టే ప్రమాదం ఉంది. అంతలోపు, వీలైతే వర్షాకాలం లోపు మొత్తం కరోనాను తరిమికొట్టి జీరో పేషెంట్ పరిస్థితి కల్పించుకున్న వారు ఈ కరోనా గండం నుండి గట్టెక్కుతారు. లేదంటే కరోనా కట్టడి వ్యాక్సిన్ రావాల్సిందే. అంటే రెడ్ ఫీల్డ్ చెప్తున్న అంశం మరీ కొట్టిపారేసేది కాదని తెలుస్తోంది.

English summary
Redfield, director of the American Center for Disease Control and Prevention, is hearing the worst news for America. 45,000 people have died in two months in the US due to the corona epidemic. The epidemic has infected more than 8 million people. The Redfield word is trembling at how many millions more lives are lost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X