రేప్: 8 ఏళ్ళ కూతురితో వార్తలు చదివి టీవీ యాంకర్ నిరసన

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: చిన్నారులని కూడ చూడకుండా కామాంధులు అత్యాచారాలకు పాల్పడడంపై పాకిస్థాన్ దేశంలో ఓ ఛానెల్ న్యూస్ యాంకర్ తన కూతురిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వార్తలు చదవిని తన నిరసనను వ్యక్తం చేశారు.

సమాజంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకోవడంపై సమా టీవీ ఛానెల్ న్యూస్ యాంకర్ కిరణ్ నాజ్ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.లోకం గురించి తెలియని చిన్నారులను సైతం వదిలిపెట్టకుండా కామాంధులు రెచ్చిపోతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కిర్ నాజ్ నిరసనను వ్య క్తం చేశారు.

 This SAMAA TV news reader hosts bulletin with daughter to protest 8-yr-old’s rape and murder...

పాకిస్థాన్‌లోని సమా టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ కిరణ్ నాజ్ అదే పని చేశారు. తాను ఇప్పుడు కిరణ్ నాజ్‌ను కాదని, ఓ చిన్నారికి తల్లినని చెప్తూ భావోద్వేగంతో మాట్లాడారు. తన కుమార్తెను ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని వార్తలు చదివారు.

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో కసూర్ అనే పట్టణం ఉంది. ఓ ఎనిమిదేళ్ళ బాలిక ట్యూషన్ నుంచి వస్తూండగా ఓ దుర్మార్గుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసి, చెత్త కుప్పలో పడేశాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటివద్ద వదిలేసి సౌదీ అరేబియా వెళ్ళినపుడు ఈ దుర్ఘటన జరిగింది.

దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ పరిణామాలు న్యూస్ యాంకర్ కిరణ్ నాజ్‌ను తీవ్రంగా కలచివేశాయి.

దీంతో ఆమె తన కుమార్తెను ఒళ్లో కూర్చోబెట్టుకుని న్యూస్ బులెటిన్ చదివి, నిరసన తెలిపారు. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండించారు. 1 నిమిషం 50 సెకండ్లపాటు సాగిన ఈ నిరసనలో ఆమె చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఈరోజు నేను కిరణ్ నాజ్‌ను కాదు. ఈరోజు నేను ఓ తల్లిని. అందుకే నేను నా కుమార్తెతో ఇక్కడ ఉన్నానని ఆమె ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Riots erupted in Pakistan’s Kasur city area on Wednesday as residents agitated against perceived police inaction over the rape and murder of an 8-year-old resident of the city

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి