షాకింగ్: ముగ్గురు మగాళ్ల పెళ్లికి అనుమతి! అందులో నటుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

కొలంబియా: కొలంబియా స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ముగ్గురి పెళ్లికి కూడా చట్టబద్ధత లభించింది.

ముగ్గురు పురుషుల పెల్లి.. పాలియామరస్

ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకుని పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియోలో నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడాడు.

Three men marriage gets legal acclaim in Colombia

గుర్తింపు కోరుకుంటున్నామని నటుడు

తాము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నామని, మా హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నామని నటుడు విక్టర్ హుగో ప్రాడా పేర్కొన్నాడు.

పెళ్లి చేసుకున్న ముగ్గురిలో ఇతనూ ఓ వ్యక్తి. కాగా తన జీవిత భాగస్వాములుగా స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, జర్నలిస్టు మాన్యూల్ జోన్ బెర్మాముండేజ్ ఉంటారని పేర్కొన్నాడు.

లీగల్ పైపర్లు

తమ వివాహానికి సంబంధించిన లీగల్ పేపర్లపై మెడిలిన్ నగరానికి చెందిన అధికారి సమక్షంలో సంతకాలు జరిగాయన్నారు. ఇకపై తమ ఫ్యామిలీ యూనిట్‌కు న్యాయపరమైన గుర్తింపు లభించిందన్నారు.

ప్రపంచంలోనే తొలి పాలియామర్ ఫ్యామిలీ

ప్రపంచంలోనే తమదే తొలి పాలియామర్ ఫ్యామిలీ అని పేర్కొన్నారు. న్యాయవాది, స్వలింగ సంపర్కుల పోరాటవాది జర్మన్ రికాన్ మాట్లాడుతూ కొలంబియాలో ముగ్గురు వ్యక్తుల యూనిట్‌లు చాలా ఉన్నాయని, అయితే ఇప్పుడు జరిగిన వివాహానికి అధికారిక గుర్తింపు దక్కిందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A place where same-sex marriage is legal since April last year, three gay men claimed their polyamorous marriage been legitimised in Colombia.
Please Wait while comments are loading...