పరువు హత్య: మంచానికి కట్టి కరెంట్ షాకిచ్చి చంపారు

Posted By:
Subscribe to Oneindia Telugu

కరాచీ: ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయిన ప్రేమికులను పరువు కోసం హత్య చేశారు తల్లిదండ్రులు. అత్యంత కిరాతకంగా గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్‌ పెట్టి ప్రేమికులను చంపేశారు.

పాకిస్థాన్‌లోని కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ కూడ తమ ఇళ్ళ నుండి గత మాసంలో పారిపోయారు.

Tied To Cot, Teenage Couple Electrocuted In Pakistan's Karachi In 'Honour Killing'

అయితే రెండు కుటుంబసభ్యులు ప్రేమికులు వారిని తీసుకువచ్చారు.జిర్గా కుల పెద్దలు ప్రేమికులను చంపాలని తీర్మాణం చేసింది. మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్ పెట్టి చంపాలని గ్రామపెద్దలు తీర్మాణం చేశారు. కుల పరువును తీసినందుకు కుల పెద్దలు ఈ మేరకు ఆదేశించారు.

మొదటి రోజు అమ్మాయిని, రెండోరోజు అబ్బాయిని చంపేశారు. ప్రేమికుల పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినప్పటికీ కూడ కుల పెద్దలు మాత్రం అంగీకారం తెలపకపోవడంతో మంచానికి కట్టేసి విద్యుత్‌షాక్‌తో చంపేశారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించుకొని పారిపోయి వివాహం చేసుకుందామనుకున్న ఓ యువజంట(అమ్మాయికి 15, అబ్బాయికి 17)ను ఇరు కుటుంబాల సభ్యులు కళ్లముందే అతి దారుణంగా చంపేశారు. కుటుంబం పరువు తీశారని కళ్లెర్రజేస్తూ వారిద్దరిని నులక మంచానికి కట్టిపడేసి కరెంట్‌ షాక్‌ పెట్టి చంపారు. ఈ దృశ్యాన్ని ఊరంతా కూడా తిలకిస్తూ ఏ మాత్రం మానవత్వం లేనివారిగా వ్యవహరించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కరాచీలోని జిర్గా అనే గిరిజన సంతతికి చెందిన ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

కానీ, వారిని పట్టి బందించి తీసుకొచ్చాక ఆ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపే జిర్గా అనే కులపెద్దల సంఘం సమావేశం ఏర్పాటుచేసింది. వారిద్దరు కుల పరువు తీశారని వారిని మంచానికి కట్టిపడేసి చంపేయాలని ఆదేశించడంతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తూ రెండు కుటుంబాల ముందే మంచానికి కట్టిపడేసి కరెంట్‌ షాక్‌ పెట్టి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాలకు చెందిన వారిని, కుల పెద్దలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

తొలి రోజు అమ్మాయిని, రెండో రోజు అబ్బాయిని ఇలా చంపి పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఆ జంట తల్లిదండ్రులు ఒక ఒప్పందానికి వచ్చినా జిర్గా సంఘం అంగీకరించకపోవడంతో ఈ పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. జిర్గా సంఘం ప్రభుత్వ చట్టాలకంటే కఠినంగా పనిచేస్తుందని, ఆ ప్రజలు కూడా చట్టాలకంటే జిర్గా పెద్దల మాటలే పట్టించుకుంటారని తెలిపారు. ప్రతి ఏటా పరువు హత్యల్లో 500మంది పాకిస్థాన్‌ మహిళలు బలవుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Pakistani teenage couple who tried to elope were murdered with electric shocks in an "honour killing" by family members who were carrying out the orders of an influential tribal council, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X