Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బద్దలైన అగ్ని పర్వతం.. భారీ భూకంపం.. ఈ రాత్రి మహా ప్రళయం..!

జపాన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. వరుస భూకంపాలతో ఆ దేశం అట్టుడికి పోతోంది. ఇప్పటికే జపాన్ లోని టోకారా దీవుల్లో జులై 5(శనివారం)న 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. తాజాగా జపాన్ లోని షిన్మోడాకే అనే అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అగ్ని పర్వతం నుంచి పొగ, బూడిద భారీగా ఎగిసిపడుతోంది. ఓవైపు భూ ప్రకంపనలు.. మరోవైపు అగ్నిపర్వతం బద్దలు కావడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బాబా వంగా అంచనా నిజమైతుందా అని ఆందోళన చెందుతున్నారు.

Tokara Islands Shaken by 5 3 Magnitude Quake and Shinmodake Volcano Eruption on July 5

జపాన్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. వరుస భూకంపాలతో ఆ దేశం అట్టుడికి పోతోంది. తాజాగా జపాన్ లోని టోకారా దీవుల్లో జులై 5న 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి సౌత్ వెస్టర్న్ జపాన్ లో ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని జపాన్ మెటిరియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. టొకారో దీవుల్లో ఉదయం 6 గంటల 29 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంపం 20 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గత వారం రోజుల్లో 1000 భూకంపాలు సంభవించినట్లు సమాచారం అందుతోంది.

ఇక జపాన్ లోని నాన్ కై ట్రఫ్ లో 8 అంతకంటే అధిక తీవ్రతతో భూకంపం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా జపాన్ లోని షిన్మోడాకే అనే అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అగ్ని పర్వతం నుంచి పొగ, బూడిద భారీగా ఎగిసిపడుతోంది. ఓవైపు భూ ప్రకంపనలు.. మరోవైపు అగ్నిపర్వతం బద్దలు కావడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బాబా వంగా పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సుకి అంచనా జపాన్ వాసులను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

బాబా వెంగా రాసిన 'ది ఫ్యూచర్ ఐ సా' పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని.. భూకంపాలు, వరదలు విజృంభిస్తాయని పేర్కొంది. ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో ఉంది. దీంతో జపాన్ ప్రజలు జులై 5 అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఇదే రోజు జపాన్ లో భూకంపం సంభవించడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.

అయితే బాబా వెంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ ‎ను సునామీ ముంచెత్తింది. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేరొందింది. ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇక జూన్ 21 నుంచి ఇప్పటివరకు టొకారో దీవుల్లో 1000 కు పైగా భూకంపాలు సంభవించాయి. జులై 3 న కూడా 5.5 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+