పాకిస్థాన్ ఫసక్.. కిలో టమాటో ధర రూ. 700 ..!
పాకిస్థాన్ ను ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ లో కేజీ టమాటో ధర రూ. 700 లకు పైనే ఉంది. చికెన్.. ఇతర ఆహారాల ధరల కంటే టమాటో ధర ఇప్పుడు పాకిస్థానీ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. పాకిస్థాన్ లోని ప్రముఖ పట్టణాలైన లాహోర్, కరాచీలో ఇప్పుడు కేజీ టమాటో ధర రూ. 700 లకు పైగానే పలుకుతోంది. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వారాల క్రితం కేజీ టమాటో ధర రూ. 100 వరకే ఉంది. ఇప్పుడు అమాంతం పెరిగిపోయినట్లు స్థానిక న్యూస్ ఛానెల్ సమా టీవీ పేర్కొంది.
అఫ్గానిస్తాన్ తో ఉద్రిక్త వాతావరణంతో పాటు ఇటీవల పాకిస్థాన్ లో కురిసిన భారీ వర్షాలకు అకాల వరదలు సంభవించాయి. వరదల ధాటికి పాకిస్థాన్ లోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే పాక్ లోని అంతర్గత వాణిజ్యం పూర్తిగా దెబ్బతింది. దీంతో సప్లై కొరత పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నట్లు సమా టీవీ పేర్కొంది. పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యం కొనుగోలు చేసే ఆహారంలో టమాటో ఒకటి. అయితే ప్రస్తుతం వీటి ధర పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారింది. టమాటో ధరలు పెరగడానికి స్థానిక సమస్యలతోపాటు అఫ్గానిస్తాన్ తో దెబ్బతిన్న వాణిజ్యం కూడా కారణంగా చెప్పవచ్చు.
పాకిస్థాన్ లోని సమా టీవీ పేర్కొన్న కథనం ప్రకారం.. పాకిస్థాన్ లో వరదలు సంభవించాయి. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. వాణిజ్యం దెబ్బతింది. రవాణా తగ్గిపోయింది. అందువల్ల టమాటో ధరలు అమాంతం పెరిగిపోయాయి. అలాగే అఫ్గానిస్తాన్ తో వివాదం కారణంగా అక్కడి నుంచి పాకిస్థాన్ కు టమాటో సరఫరా నిలిచిపోయింది. టమాటోతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇందువల్ల పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పాకిస్థాన్ లోని జీలమ్, గుజ్రాన్ వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, లాహోర్ లాంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం కేజీ టమాటో ధర రూ. 400 నుంచి రూ. 700 వరకు పలుకుతున్నట్లు సమా టీవీ పేర్కొంది. రిపోర్ట్స్ ప్రకారం.. ఇటీవలి వరదల కారణంగా టమాటో ధరలకు రెక్కలు వచ్చాయి.












Click it and Unblock the Notifications