యుద్ధం అంచున ఇరాన్ ..! రేపటి నుంచి భారత్ ఆపరేషన్..!
ఇరాన్ లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్న వేళ అమెరికా సైనిక చర్యకు సంకేతాలు ఇస్తోంది. ఇరాన్ లో నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ లో భారతీయుల పరిస్ధితి దినదిన గండంగా మారబోతోంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగబోతోంది. రేపటి నుంచి కీలక ఆపరేషన్ చేపట్టేందుకు సిద్దమైంది.
ఇరాన్ లో నిరసనలకు తీవ్రమవుతుండటం, అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశం ఉండటంతో ఇప్పటికే కేంద్రం అక్కడ నివసిస్తున్న భారతీయులకు అలర్ట్ జారీ చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, లేకపోతే తరలి స్వదేశానికి వచ్చేయాలని కోరుతోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని తామే స్వయంగా భారత్ కు తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఇరాన్ లో అల్లర్ల కారణంగా భారతీయుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన మన వారిని తరలించడానికి కేంద్రం అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తరలింపుదారుల మొదటి బ్యాచ్‌ను రేపు ముందుగానే విమానంలో పంపించేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. దేశం విడిచి వెళ్లాలనుకునే వారిని అంచనా వేయడానికి టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వివిధ ప్రాంతాలలోని భారతీయ విద్యార్థులను సంప్రదించడం ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, ఫోన్ లైన్లు అరకొరగా పనిచేస్తున్నందున ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications