వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందిన టాప్ తాలిబన్ లీడర్ .. అనూహ్యం ; టాప్ 7 తాలిబన్ నాయకులు వీరే !!

|
Google Oneindia TeluguNews

తాలిబన్లు... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి వీరిపైనే ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ దళాలను ఉపసంహరించుకోవడంతో ఊహించని విధంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం తాలూకా ఆటవిక పాలనపై ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో, అసలు తాలిబన్లు ఎవరు, తాలిబన్ ముఖ్య నాయకులు ఎవరు? తాలిబన్ ముఖ్య నాయకుల నేపథ్యం ఏంటి? అన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. తాలిబన్ ముఖ్య నాయకుల్లో ఒకరు ఇండియన్ మిలటరీ అకాడమీ నుండి శిక్షణ పొందిన వ్యక్తి కావటం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

తాలిబన్ టాప్ 7 ముఖ్య నాయకులు వీరే .. వీరిలో స్తానిక్ జై ప్రత్యేకం

తాలిబన్ టాప్ 7 ముఖ్య నాయకులు వీరే .. వీరిలో స్తానిక్ జై ప్రత్యేకం

తాలిబన్ ముఖ్య నాయకులలో ఏడుగురు అత్యంత శక్తివంతమైన నాయకులు ఉన్నారు. వారు వరుసగా హైబతుల్లా అఖుంద్‌జాదా, సుప్రీం కమాండర్, అబ్దుల్ ఘని బరదార్, ఉప నాయకుడు, సిరాజుద్దీన్ హక్కానీ, నియమించబడిన తీవ్రవాద గ్రూపు నాయకుడు,మహమ్మద్ యాకూబ్, వ్యవస్థాపకుడి కుమారుడు,అబ్దుల్ హకీమ్ హక్కానీ, అగ్ర సంధానకర్త, షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్ జై , కీలక దౌత్యవేత్తగా ఉన్నారు.

ఈ ఏడుగురు తాలిబన్ ముఖ్యనాయకులలో ఒకరైన షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్ జై , ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీలో సుశిక్షితుడైన ఒకప్పటి జవాన్ అన్న విషయం ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తుంది.

ఇండియన్ మిలటరీ అకాడెమీలో శిక్షణ పొందిన స్తానిక్ జై

ఇండియన్ మిలటరీ అకాడెమీలో శిక్షణ పొందిన స్తానిక్ జై

షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్ జై భారతదేశం తయారుచేసిన సైనికుడు . అతనిని సహచరులు 'షేరు' అని పిలిచేవారని తెలుస్తుంది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత విదేశీ యువతకు కూడా మన సైనిక అకాడమీ శిక్షణనిచ్చే ది. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తరువాత ఆఫ్ఘనిస్థాన్ యువతకు కూడా ఇండియన్ మిలిటరీ అకాడమీ శిక్షణ ఇచ్చింది. అలా శిక్షణ పొందిన వారిలో షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్ జై ఒకరు. ఆయన 1982లో ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. భారతదేశంలో అతను శిక్షణ పొందిన సమయంలో అతని వయసు 20 ఏళ్లు.

ఇండియన్ మిలటరీ అకాడెమీలో ఎన్నో అవార్డులను అందుకున్న స్తానిక్ జై

ఇండియన్ మిలటరీ అకాడెమీలో ఎన్నో అవార్డులను అందుకున్న స్తానిక్ జై

ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి శిక్షణ పొందిన షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్ జై మంచి పోరాటపటిమ కలిగిన యోధుడిగా గుర్తింపు పొందారు. మంచి ధైర్యవంతుడుగా అతనికి పేరొచ్చింది. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పరమ్ విశిష్ట సేవా పురస్కారం, అతి విశిష్ట సేవా పురస్కారం, సేవ పురస్కార్ వంటి ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ పొందిన సమయంలో అతను అందరితో స్నేహంగా ఉండేవాడని, మన పక్కింటి అబ్బాయిలా అనిపించే వాడని అప్పటి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్ జై బ్యాచ్ మేట్స్ అతని గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాలిబన్ నాయకుడిగా మారిన స్తానిక్ జై నేపధ్యం ఇదే

తాలిబన్ నాయకుడిగా మారిన స్తానిక్ జై నేపధ్యం ఇదే

ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరినప్పుడు అతనిలో పెద్దగా మతవిశ్వాసాలు కూడా కనిపించ లేదన్నారు. భగత్ బెటాలియన్ యొక్క కెరెన్ కంపెనీకి చెందిన 45 విదేశీయుల క్యాడెట్లలో ఒకదానిలో చేరి శిక్షణ తీసుకున్నారని వివరించారు. ఇండియన్ మిలటరీలో శిక్షణ తీసుకున్న స్తానిక్ జై ఎలా తాలిబన్ నాయకుడిగా మారాడంటే అందుకు అతని నేపథ్యమే కారణమని తెలుస్తుంది. ప్రారంభ సంవత్సరాల్లో 1963 లో ఆఫ్ఘనిస్తాన్‌లోని లోగర్ ప్రావిన్స్‌లోని బరాకి బరాక్ జిల్లాలో జన్మించిన స్టానిక్‌జాయ్ జాతిపరంగా పష్టున్ కావటం కూడా ఒక కారణం అని తెలుస్తుం

ఇండియాలో శిక్షణ పొంది ఆఫ్ఘన్ సైన్యంలో పని చేసి తాలిబన్ గా మారిన స్తానిక్ జై

ఇండియాలో శిక్షణ పొంది ఆఫ్ఘన్ సైన్యంలో పని చేసి తాలిబన్ గా మారిన స్తానిక్ జై

పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన తరువాత, అతను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చదువుకున్నాడు. ఇండియాలోనే ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం సంపాదించాడు. 1970 లలో ఆఫ్ఘన్ సైన్యం అధికారులకు శిక్షణ ఇవ్వడంలో పాల్గొన్నాడు. ఆఫ్ఘన్ సైన్యానికి సేవ చేసి, సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో పోరాడిన తరువాత, 1996 లో, అతను ఆఫ్ఘనిస్థాన్ సైన్యాన్ని వదిలిపెట్టి తాలిబన్‌లో చేరాడు. తాలిబన్ల 1996-2001 ఆఫ్ఘనిస్థాన్ పాలనలో, స్తానిక్ జై విదేశాంగ వ్యవహారాల ముఖ్యమంత్రిగా తరువాత ఆరోగ్య ఉప మంత్రిగా పనిచేశారు.

తాలిబన్ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన స్తానిక్ జై

తాలిబన్ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన స్తానిక్ జై

1996 లో, తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు దౌత్యపరమైన గుర్తింపును అందించమని బిల్ క్లింటన్ పరిపాలనను కోరడానికి స్తానిక్ జై విదేశాంగ ఉప మంత్రిగా వాషింగ్టన్, DC కి వెళ్లారు. తరువాతి సంవత్సరాలలో అతను తాలిబాన్ యొక్క అత్యంత ముఖ్యమైన సంధానకర్త అయ్యాడు . పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌తో అతని సంబంధాల కారణంగా తాలిబన్లలో అతను కీలకంగా మారాడు. 2012 లో దోహాలో తాలిబన్ గ్రూప్ తన రాజకీయ కార్యాలయాన్ని స్థాపించిన తరువాత షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్ జై దానిని నడిపించాడు . తాలిబన్ తరపున ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చలు నడిపించాడు. స్తానిక్ జై చర్చలకు కీలక సంధానకర్తగా వ్యవహరించారు.

Recommended Video

తాలిబన్లపై PM Modi కీలక వ్యాఖ్యలు..! || Oneindia Telugu
తాలిబన్ ముఖ్య నాయకులలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు

తాలిబన్ ముఖ్య నాయకులలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు

ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్న తాలిబన్ల చర్చల బృందం అధిపతి అబ్దుల్ హకీమ్ హక్కానీకి డిప్యూటీ సంధానకర్తగా కూడా వ్యవహరించాడు.అంతకుముందు సెప్టెంబర్ 2020 లో, ఆఫ్ఘన్ ప్రభుత్వంతో శాంతి గురించి చర్చించడానికి తాలిబన్లు సమావేశమైనప్పుడు, స్తానిక్ జై మొదట చర్చల బృందానికి నాయకత్వం వహించడానికి నియమించబడ్డాడు. ప్రస్తుతం, స్తానిక్ జై సంస్థలో అత్యంత ప్రభావవంతమైన ఏడుగురు వ్యక్తులలో ఒకరుగా ఉన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మిలిటెంట్ ముఠా నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ శకం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లపై ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్ జై ఇండియా నుండి శిక్షణ పొందిన సైనికుడు అని తెలియటం ఆసక్తికర అంశంగా మారింది.

English summary
Taliban's top 7 leaders are Haibatullah Akhundzada,Abdul Ghani Bardar,Sirajuddin Haqqani, Mohammed Yaqub, Abdul Hakeem Haqqani,Sher Mohammad Abbas stanikzai . Sher Mohammad Abbas Stanikzai, a former jawan trained at Indian Military Academy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X