వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. రోడ్డుపై అనకొండ.. పాకుతూ వెళ్లిన 10 అడుగుల పెద్ద పాము

|
Google Oneindia TeluguNews

అడవిలోని జంతువులు, సరీసృపాలు మానవ ఆవాసాలకు వస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. ఆహారం కోసం, ఆవాసం కోసం దారితప్పి మానవ ఆవాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలోని రోడ్లపై జంతువులు, పాములు రోడ్డును దాటుతూ ఒకవైపు నుంచి మరొవైపుకు వెళ్లిన సంఘటనలు కొకొల్లలు.

బ్రెజిల్‌లోని హైవేపై ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెద్ద అనకొండ రోడ్డును దాటుకుంటు వెళ్లింది. మొదట దీన్నిచూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలే అది హైవే.. వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోంచి ఒక పదడుగుల అనకొండ బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మెల్లగా పాకుకుంటూ.. డివైడర్‌ ఎక్కేసింది. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లసాగింది. అనకొండ ను చూసిన ప్రయాణికులు .. తమ వాహనాలను ఆపివేసి దాన్ని తమ మొబైల్‌లో వీడియో తీసుకుంటున్నారు. అనకొండకు ఎవరు కూడా ఆపద తలపెట్లలేదు.

traffic halts giant anaconda crosses busy road at brazil

వేగంగా వచ్చిన వాహనదారులు.. కార్లను రోడ్డుకు ఒకవైపు నిలిపేసి ఆ అనకొండను ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరికొందరు దూరం నుంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే, అనకొండ మాత్రం మెల్లగా పాకుకుంటూ.. రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి వెళ్లి అదృష్యమయ్యింది. కాగా, ఈ వీడియోను ఒక బ్రెజిల్‌లోని ఒక వ్యక్తి అనిమల్స్‌ వేంచర్‌ అనే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. దీనికి ఇతను 'అనకొండ రోడ్డుదాటుతుంటే.. ప్రయాణికులు చూస్తు ఉండిపోయారు' అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

Recommended Video

Viral Video : A Cat Saves Family Against Snake | Oneindia Telugu

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు 'ఎంత బాగా పాకుకుంటూ వెళ్తుంది..','అనకొండకు.. ఆపద కల్గించనందుకు ధన్యవాదాలు..', 'జంతువుల మనుగడకు మనుషులు సహాయపడుతున్నందుకు థ్యాంక్స్‌.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా బ్రెజిల్‌ అడవులలో ఉండే అనకొండలు 550 పౌండ్ల బరువుని కల్లి ఉండి, 29 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి.

English summary
traffic halts giant anaconda crosses busy road. incident happen at brazil country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X