50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ.. 17 వాహనాలు అగ్నికి ఆహుతి !!

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వరుస ప్రమాద ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. మరో వైపు రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు సైతం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం సర్వత్రా ఆవేదన నింపుతున్నాయి. ఇప్పుడు జపాన్‌లోని గున్మా ప్రిఫెక్చర్‌లోని మినాకామి పట్టణం సమీపంలో గల కన్-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

భారీగా మంచు కురుస్తుండడం.. రోడ్డుపై గడ్డకట్టిన మంచుతో 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో అనేక వాహనాలు కాలి బూడిదయ్యాయి. కాగా రాత్రి 7:30 గంటల సమయంలో మొదట రెండు ట్రక్కులు ఢీకొన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత వెనుక వస్తున్న వాహనాలు బ్రేక్స్ వేయడంతో విఫలమవ్వడంతో.. ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నట్టు చెబుతున్నారు.

tragic-accident-at-japan-that-50-vehicles-collide-and-17-burnt

క్షణాల వ్యవధిలోనే సుమారు 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదం అనంతరం కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దాదాపు 17 వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో టోక్యోకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలానే 26 మంది గాయపడగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు.

కన్-ఎత్సు ఎక్స్‌ప్రెస్‌వే రాజధాని టోక్యోను నిగాటా ప్రిఫెక్చర్‌తో అనుసంధానించే కీలక రహదారి. జపాన్‌లో నూతన సంవత్సర సెలవులు ప్రారంభమైన వేళ, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ నిప్పాన్ ఎక్స్‌ప్రెస్‌వే కంపెనీ (NEXCO ఈస్ట్) ప్రమాదం కారణంగా రహదారిపై రాకపోకలను నిలిపివేసింది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు, భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే రహదారి ట్రాఫిక్‌కు ఎప్పుడు అనుమతిస్తారనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+