కోరమాండల్ తరహా రైలు ప్రమాదం- పలువురు దుర్మరణం
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు హైస్పీడ్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఎదురెదురుగా ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
స్పెయిన్ దక్షిణ ప్రాంతంలో కార్డోబా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. అదముజ్ టౌన్ వద్ద ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:40 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 21 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. తొలుత ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. మలగా నుండి మాడ్రిడ్‌కు వెళ్తున్న నంబర్ 6189 ఇరియో హై-స్పీడ్ రైలు అది. దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో మాడ్రిడ్ నుండి హుయేల్వాకు బయలుదేరిన మరో రెన్ఫే రైలు వాటిని ఢీ కొట్టింది.

కార్డోబా నుండి బయలుదేరిన 10 నిమిషాల్లో పట్టాలు తప్పింది ఇరియో రైలు. పక్క ట్రాక్‌పైకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో ఇరియో రైలులో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. రెన్ఫే సర్వీస్‌లో సుమారు 100 మంది ఉన్నట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడిక్ బృందాలు, రెడ్‌క్రాస్‌తో సహా అత్యవసర సేవల ఉద్యోగులు ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి.
WATCH 🔴
— Open Source Intel (@Osint613) January 18, 2026
SPAIN: This is the condition of an Iryo high speed train after it derailed in Adamuz, with a separate AVE train also affected.
Multiple casualties reported. pic.twitter.com/oknyYd6pcl
పలువురు ప్రయాణికులు దెబ్బతిన్న బోగీలలో గంటల తరబడి చిక్కుకుపోయారు. ఇరియో రైలును ఖాళీ చేశామని, రెన్ఫే బోగీలలో పరిస్థితి దారుణంగా ఉందని కార్డోబా ఫైర్ సర్వీస్ చీఫ్ పాకో కార్మోనా తెలిపారు. పలువురు ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోయారని, ఎంత మంది మరణించారో తెలియట్లేదని అన్నారు. నుజ్జునుజ్జు అయిన బోగీల నుంచి వారిని సురక్షితంగా వెలికి తీయాల్సి వస్తోందని అన్నారు.
గాయపడ్డ వారిని మాడ్రిడ్, అండలూసియాలోని ఆసుపత్రులకు తరలించారు. సుమారు 5,000 మంది నివాసితులు ఉన్న అదముజ్ టౌన్ లో అప్పటికప్పుడు ఓ హెల్ప్ సెంటర్, మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. పలువురు మెడికల్ వలంటీర్లు స్వచ్ఛదంగా వైద్య సేవలను అందిస్తోన్నారు. రాత్రివేళ.. మైనస్ కు పడిపోయిన ఉష్ణోగ్రత మధ్య గాయపడ్డ వారికి ఆహారం, దుప్పట్లు, వేడి పానీయాలు అందిస్తోన్నారు. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్, అండలూసియా మధ్య అన్ని హైస్పీడ్ రైలు సేవలను నిలిపివేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
Esto es peor de lo que parecía desde nuestro coche. pic.twitter.com/1VzdLIPAAs
— Carmen (@eleanorinthesky) January 18, 2026
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications