Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్: ఆ నిషేధం మరో నెలరోజులు పొడిగింపు

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రావట్లేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రావట్లేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

పాక్షికంగా సడలింపు..

పాక్షికంగా సడలింపు..

ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గిపోతోండటంతో విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధపడుతోన్నాయి. ఈ జాబితాలో ఉన్న బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ ఆంక్షలను సడలించుకున్నాయి. పరిమితంగా విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదివరకు విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న ప్రయాణికులను విమానాలు ఎక్కడానికి అనుమతి ఇస్తోన్నాయి.

 అమెరికా, కెనడా దీనికి భిన్నం..

అమెరికా, కెనడా దీనికి భిన్నం..

అమెరికా, కెనడా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోన్నాయి. భారత్‌కు విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ప్రారంభమైన తొలి రోజుల్లో విధించిన నిషేధాన్ని కెనడా మళ్లీ పొడిగించింది. మరో నెలరోజుల పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది. నిజానికి- కెనడా విధించిన ట్రావెల్ బ్యాన్ ఈ నెల 21వ తేదీన ముగియాల్సి ఉండగా.. దాన్ని సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు కెనడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువడించినట్లు ఎఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ నిషేధం కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులకు మాత్రమే వర్తింప జేసింది. కార్గో సర్వీసులకు మినహాయింపును ఇచ్చింది. అవి యధాతథంగా రాకపోకలు సాగిస్తాయి.

 ఇంకో నెలరోజులు..

ఇంకో నెలరోజులు..

కెనడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం భారత ప్రయాణికులకు బిగ్ షాక్ లాంటిదే. ఇప్పటికే కొన్ని నెలలుగా విమాన సర్వీసులను ఎప్పుడెప్పుడు పునరుద్ధరిస్తారా అంటూ ఎదురు చూస్తోన్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం వల్ల ఈ నెల 21వ తేదీ తరువాత విమాన సర్వీసులను రీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చని ఆశించారు. భారత్-కెనడాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య అధికం. కెనడా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మరో నెల రోజుల పాటు అంటే సెప్టెంబర్ 21వ తేదీ వరకు విమానాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమెరికా ఏం చేస్తుందో..

అమెరికా ఏం చేస్తుందో..

కెనడా తీసుకున్న నిర్ణయంతో ఇక అందరి దృష్టీ అమెరికాపై పడింది. అమెరికా కూడా కెనడా తరహాలోనే భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై నిషేధాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. మే 6వ తేదీన అమల్లోకి తీసుకొచ్చిన ఈ ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో భారత్ కోసం అమెరికా కొత్త ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత్‌కు వెళ్లొచ్చంటూ తమదేశ ప్రయాణికులకు సూచించింది. ఏప్రిల్ 29వ తేదీన జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీలో మార్పులు చేసింది. ఇదివరకు అత్యంత ప్రమాదకరమైన లెవెల్ 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేయగా.. ఆ కేటగిరీలో మార్పులు చేసి, లెవెల్ 3లోకి చేర్చింది. లెవెల్ 3 అంటే- తమదేశ పౌరులు ఎవరైనా భారత్‌కు రాకపోకలు సాగించవచ్చని అర్థం. అయినప్పటికీ- విమాన సర్వీసులను ఇదివరకట్లా పూర్తి స్థాయిలో నడిపించడానికి అమెరికా సైతం ముందుకు రావట్లేదు.

 డీజీసీఏ ఏం చెబుతోంది..?

డీజీసీఏ ఏం చెబుతోంది..?

అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టంగా ఉంది. దేశం సరిహద్దులను దాటుకుని వెళ్లే కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను ఈ నెల చివరి వరకూ పొడిగించింది. ఈ మేరకు కిందటి నెల 30వ తేదీన ఓ ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమర్షియల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసినట్టయింది. భారత విమాన ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్‌ను కొనసాగిస్తోనన దేశాలు సానుకూలంగా స్పందించకపోవడం వల్లే డీజీసీఏ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కొనసాగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

కరోనా వైరస్ తీవ్రత తగ్గినా..

కరోనా వైరస్ తీవ్రత తగ్గినా..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత బాగా తగ్గింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉంటోంది. ఈ సంఖ్య 30,000 నుంచి 40,000 మధ్యే నమోదవుతోంది. మరణాల సంఖ్య కూడా ఇదివరకట్లా దడ పుట్టించట్లేదు. ఆగస్టు చివరివారంలో థర్డ్‌వేవ్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 35,499 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో డిశ్చార్జీలు కూడా నమోదయ్యాయి. రికవరీ రేటు 97.40 శాతంగా నమోదైంది.

Recommended Video

    Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu
     ప్రయాణికుల్లో అసహనం..

    ప్రయాణికుల్లో అసహనం..

    అయినప్పటికీ- అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రాకపోవడం పట్ల ఒకింత అసహనం, అసంతృప్తి వ్యక్తమౌతోంది విమానయాన ప్రయాణికుల్లో. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ విజృంభించే అవకాశం ఉండటం వల్లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోందనే వాదనలు కూడా లేకపోలేదు. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం, థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోందని చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+