ఉత్తరకొరియాకు ఊహించని షాకిచ్చిన ట్రంప్.. మళ్లీ భారీగా ఆంక్షలు!

వాషింగ్టన్: ఉత్తరకొరియాకు ఊహించిని షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కొంతకాలంగా ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌పై మౌనం వహిస్తూ వచ్చిన ఆయన తాజాగా పెద్ద బాంబు పేల్చారు. ఉత్తరకొరియాపై భారీగా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం నిర్వహించిన నిపుణుల సంఘం భేటిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగిస్తూ.. ''ఈరోజు నేను కీలక ప్రకటన చేస్తున్నా.. ఉత్తరకొరియాపై ఎవరూ ఊహించని రీతిలో అమెరికా భారీగా ఆంక్షలు విధిస్తోంది..'' అని ప్రకటన చేశారు. అమెరికా ఖజానా శాఖ ఈ మేరకు చర్యలు ప్రారంభించిందన్నారు.

Trump announces 'heaviest ever' North Korea sanctions

క్షిపణి పరీక్షలతో కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌పై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇప్పుడీ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. తాజా ఆంక్షలు ఉత్తర కొరియా మిలిటరీ, అణు పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Recommended Video

    ఉత్తరకొరియాకు చైనా మద్దతు.. రెడ్‌హ్యండెండ్‌గా దొరికింది..

    నౌకాయానానికి సంబంధించిన వాటితో పాటు మొత్తం 50 కంపెనీలపై ఆంక్షలు అమలు కానున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ కూతురు, వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్‌ కొరియా ప్రతినిధులతో భేటీ అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+