ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా ప్రజల మీద ఈగ వాలకుండా.. 17వేల కోట్లతో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అమెరికా వద్ద శక్తివంతమైన ఆయుధ సంపత్తి కలిగి ఉంది. దీనికి తోడు 175 బిలియన్ డాలర్లు(రూ. 17 వేల కోట్లకు పైగా) ఖర్చు పెట్టి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో అమెరికా టాప్ 3లో ఉంది. అయితే అమెరికాకు శత్రు దేశాలు ఎక్కువ. లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్ లాంటి అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు కూడా అగ్రరాజ్యం కదలికలపై ఎప్పుడూ నిఘా పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాను మిస్సైల్స్ దాడి నుంచి రక్షించుకునేందుకు 'గోల్డెన్ డోమ్' ఏర్పాటుకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. 175 బిలియన్ డాలర్లు(రూ. 17 వేల కోట్లకు పైగా)తో ఈ 'గోల్డెన్ డోమ్' ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడేళ్లలోనే 'గోల్డెన్ డోమ్' ను ఏర్పాటు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం 25 బిలియన్ డాలర్లను మొదటి దశలో ఖర్చు చేస్తామని.. ప్రాజెక్ట్ చివరి దశకు చేరేలోపు 175 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి 'గోల్డెన్ డోమ్' నిర్మిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు." ఎన్నికల ప్రచారంలో నేను అమెరికా ప్రజలకు వాగ్ధానం చేశాను. అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ట్రంప్ తెలిపారు.

గోల్డెన్ డోమ్ పూర్తయితే రక్షణ వ్యవస్థలో అమెరికా మరింత బలోపేతం అవుతుందని అన్నారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా గోల్డెన్ డోమ్ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికా కు ఏమీ కాదని తెలిపారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇప్పటికే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications