ఉత్తరకొరియాకు చైనా మద్దతు: రెడ్‌హ్యండెండ్‌గా దొరికింది, డ్రాగన్‌పై ట్రంప్ నిప్పులు

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఉత్తరకొరియాకు చైనా మద్దతు.. రెడ్‌హ్యండెండ్‌గా దొరికింది..

  వాషింగ్టన్: ఉత్తరకొరియాకు చైనా మద్దతిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉత్తరకొరియాకు చైనా చమురును సరఫరా చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.చైనా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిందని ట్రంప్ విరుచుకుపడ్డారు.

  ట్రంప్‌కు షాక్: వరుస ఉపగ్రహల ప్రయోగం, కిమ్ నెక్ట్స్ ప్లాన్ ఇదే

  ఉత్తరకొరియా వ్యవహరిస్తున్న తీరుతో ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరకొరియా వ్యవహరశైలిపై పలు మార్లు హెచ్చరికలు చేసినా కానీ, ఆ దేశం మాత్రం తగ్గలేదు. దీంతో ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది.

  మాతోనే అమెరికాకు అణు ముప్పు, ప్రపంచంపై ప్రభావం: కిమ్ షాకింగ్ కామెంట్స్

  అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలకు ఉత్తరకొరియాకు చమురు అవసరం. అయితే ఈ చమురును ఎక్కువగా చైనా నుండి ఉత్తరకొరియా దిగుమతి చేసుకొంటుంది. అయితే ఐక్యరాజ్యసమితి ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది.

  చైనా దొరికిపోయింది

  చైనా దొరికిపోయింది

  ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినా ఆంక్షలను తోసి పుచ్చుతూ చైనా ఉత్తరకొరియాకు చమురు సరఫరా చేయడంతో రెడ్‌హ్యండెడ్‌గా దొరికిపోయిందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.ఉత్తరకొరియాకు చైనా చమురు నిల్వలను పంపడం విచారకరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు..

  ఉత్తరకొరియా సమస్య పరిష్కరించాలి

  ఉత్తరకొరియా సమస్య పరిష్కరించాలి

  చైనా ఉత్తరకొరియాకు ఇదే రకంగా మద్దతిస్తోంటే సమస్య పరిష్కారం కాదని ట్రంప్ అభిప్రాయపడడారు.. ఈ మేరకు ట్రంప్ ట్విట్టర్ వేదికగా చైనాపై దుమ్మెత్తిపోశారు.ఐక్యరాజ్యసమితి ఆంక్షలను పాటించాలని చైనాకు ట్రంప్ సూచించారు.

  మాకేమీ తెలియదన్న చైనా

  మాకేమీ తెలియదన్న చైనా

  ఉత్తరకొరియా చైనా చమురును సరఫరా చేసిందని దక్షిణ కొరియా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని చైనా ప్రకటించింది. తమపై నిందలు వేయకూడదని చైనా తెలిపింది

  అమెరికా శాటిలైట్లు గుర్తించాయి

  అమెరికా శాటిలైట్లు గుర్తించాయి

  ఉత్తరకొరియాకు చైనా చమురును సరఫరా చేసినట్టుగా అమెరికా శాటిలైట్లు గుర్తించాయని దక్షిణ కొరియా అధికారులు ప్రకటించారు. ఈ విషయం వెలుగు చూడడంతో ట్రంప్ చైనాపై విరుచుకుపడ్డారు.సముద్ర మార్గం ద్వారా చైనా ఉత్తరకొరియాకు చమురును సరఫరా చేస్తోందని దక్షిణ కొరియా ఆరోపణలు చేసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Donald Trump on Thursday said he was “very disappointed that China is allowing oil to go into North Korea” and said such moves would prevent “a friendly solution” to the crisis over Pyongyang’s nuclear program.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి