నోటిదూలతో లేనిపోని తలనొప్పి.. మరో వివాదంలో చిక్కుకున్న ట్రంప్!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆఫ్రికాలోని నైజర్‌ దేశంలో అక్టోబర్‌ 4న జరిగిన దాడుల్లో అమెరికాకు చెందిన నలుగురు సైనికాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

  North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un

  వారిలో సార్జెంట్‌ డేవిడ్‌ టి.జాన్సన్‌ ఒకరు. అయితే దాడిలో అమరవీరులైన అధికారుల కుటుంబాలను ట్రంప్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ జాన్సన్‌ భార్య మెయ్‌షియాకి ఫోన్‌ చేసి అవమానకరంగా మాట్లాడారని జాన్సన్‌ తల్లి కోవాండా మీడియా ద్వారా వెల్లడించారు.

  Trump didn’t remember the name of slain US soldier in call to widow

  ట్రంప్‌ తన కుమారుడితో పాటు తన భర్తను, కూతుర్ని కూడా అవమానించారని కొవాండా ఆరోపించారు. అసలు తన కుమారుడి పేరు కూడా ట్రంప్‌కు తెలియదని ఆమె పేర్కొన్నారు.

  మెయ్‌షియా కూడా.. 'తన భర్త పేరు తెలియదని ట్రంప్‌ అనడంతో తనకు ఏడుపొచ్చేసింద'ని ఉద్వేగానికి లోనయ్యారు. ట్రంప్‌.. జాన్సన్‌ కుటుంబంతో ఫోనులో మాట్లాడుతున్నప్పుడు వారి సమక్షంలో డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ మహిళ ఫ్రెడెరికా విల్సన్‌ కూడా ఉన్నారు.

  ఆమె కూడా జాన్సన్‌ కుటుంబానికి మద్దతు తెలుపుతూ ట్రంప్‌ అలా అవమానకరంగా మాట్లాడటం తానూ విన్నానని చెప్పారు. అయితే ట్రంప్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించడమేకాక జాన్సన్‌ కుటుంబీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  తాను జాన్సన్‌ భార్యతో అలా మాట్లాడలేదని, డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ మహిళ ఫ్రెడెరికా విల్సన్‌ కావాలని కల్పించి చెబుతోందని ఆరోపించారు. ఇందుకు తన వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని ట్రంప్‌ ఇటీవల ట్విటర్‌లో పేర్కొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The mother of fallen U.S. Army Sgt. La David Johnson said last Wednesday that during a call with her son’s widow, Myeshia Johnson, President Donald Trump said the soldier “knew what he signed up for.” Trump has since denied he said those words and told members of the Senate Finance Committee, “I had a very nice conversation with the woman, with the wife, who sounded like a wonderful woman. I didn’t say what that congresswoman said. Didn’t say it at all, she knows it.” The initial account from Johnson’s mother, Cowanda Jones-Johnson, was first described by Rep. Frederica Wilson, D-Florida, last Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి